
కొత్తవాళ్లతో ఎంటర్‌టైనర్
అశోక్ రాయల్, అవంతిక, కీర్తికలను హీరో, హీరోయిన్లుగా పరిచయం చేస్తూ సింధు క్రియేషన్స్ పతాకంపై పులి అమృత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించ నున్న చిత్రం ‘సింధూర’. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి మామిడి హరికృష్ణ కెమేరా స్విచ్చాన్ చేయగా, తెలంగాణ రాష్ట్ర శాసనపరిషత్ చైర్మన్ కె.స్వామిగౌడ్ క్లాప్ ఇచ్చారు. దర్శక-నిర్మాత మాట్లాడుతూ- ‘‘చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న చిత్రమిది. సినిమాటోగ్రాఫర్స్‌గా అమర్‌నాథ్, విశ్వనాథ్‌లను పరిచయం చేస్తున్నాం’’ అని తెలిపారు. సంగీత దర్శకుడు సాకేత్ సాయిరామ్ తదితరులు పాల్గొన్నారు.