Actress Kushboo Daughter Avantika Sundar Latest Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Avantika Sundar: ఖుష్బూ కూతురును చూశారా.. గ్లామర్‌ ఫోటోలతో నెట్టింట హల్‌చల్‌!

Published Sun, Aug 6 2023 2:37 PM | Last Updated on Sun, Aug 6 2023 3:05 PM

Kushboo Daughter Avantika Sundar Latest Pics Goes Viral - Sakshi

ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా రాణించి, ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా బిజీ అయిన నటి  కుష్బూ. తమిళంతో పాటు తెలుగులోనూ ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి, టాలీవుడ్‌ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. విక్టరీ వెంకటేశ్‌ హీరోగానటించిన ‘కలియుగ పాండవులు’అనే చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమానే సూపర్‌ హిట్‌. ఆ తర్వాత తమిళ్‌లో వరుస సినిమాలు చేస్తూ స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు. దాదాపు తమిళ స్టార్స్‌ అందరితో ఖుష్బూ కలిసి నటించారు.

తమిళనాడు అభిమానులు ఆమెకు ఏకంగా గుడినే నిర్మించారంటే ఖుష్భూకు అక్కడ ఏ స్థాయి గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే డైరెక్టర్‌ సుందర్‌తో ప్రేమలో పడి 1991లో అతన్ని వివాహం చేసుకుంది.‍వీరికి ఇద్దరు ఆడపిల్లలు. పేర్లు అవంతిక, అనంతిక. వీరి పిల్లల గురించి చాలా మందికి తెలియదు. పెద్ద కూతురు అవంతిక ప్రస్తుతం లండన్‌లో చదువుకుంటుంది.

సోషల్‌ మీడియాలో అవంతిక చాలా ఫాలోయింగ్‌ ఉంది. తరచు తన గ్లామర్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. అవంతికి చూడడానికి అచ్చం సినిమా హీరోయిన్‌లా చాలా  అందంగా ఉంటుంది.  గ్లామర్‌ విషయంలో ఏ మాత్రం తగ్గకుండా సోషల్‌ మీడియాలో అందాలను ఆరబోస్తోంది. లండన్‌లో స్టడీస్‌ పూర్తయిన వెంటనే ఆమె సినిమాల్లోకి వచ్చేస్తుందనే టాక్‌ వినిపిస్తోంది. ఒకవేళ నిజంగానే సినిమాల్లోకి వస్తే మాత్రం తన అందచందాలతో ప్రేక్షకుల మనసు దోచుకోవడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ విషయాలను పక్కకి పెట్టి అవంతిక  ఫోటోలనే ఓ లుక్కేయండి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement