అందరికీ నచ్చేలా వైశాఖం | 'Vaisakham' Movie Coming soon | Sakshi
Sakshi News home page

అందరికీ నచ్చేలా వైశాఖం

Published Thu, Jun 16 2016 10:48 PM | Last Updated on Mon, Sep 4 2017 2:38 AM

అందరికీ నచ్చేలా వైశాఖం

అందరికీ నచ్చేలా వైశాఖం

మహిళా దర్శకుల్లో ‘డైనమిక్’ అనిపించుకున్న వాళ్లల్లో జయ బి. ఒకరు. ఆమె దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘వైశాఖం’. హరీశ్, అవంతిక జంటగా ఆర్‌జే సినిమాస్ పతాకంపై  బీఏ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ అరవైశాతం పూర్తయింది. ఈ నెల 20న మూడో షెడ్యూల్ మొదలవుతుంది. జయ బి. మాట్లాడుతూ- ‘‘నైట్ ఎఫెక్ట్‌లో ఓ ఫైట్, కీలక సన్నివేశాలు ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించబోతున్నాం. సరికొత్త కథాంశంతో అన్ని వర్గాలవారినీ  ఆకట్టుకునే విధంగా ఉంటుంది.

హీరో, హీరోయిన్స్‌తో పాటు అన్ని పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుంది’’ అన్నారు. ‘‘యువతను, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కిస్తున్నాం. చిత్రీకరణలో ఎక్కడా రాజీ పడకుండా హై బడ్జెట్‌లో తెరకెక్కిస్తున్నాం. పాటలు చాలా బాగా వచ్చాయి’’ అని బీఏ రాజు చెప్పారు. సాయికుమార్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: డీజే వసంత్, లైన్ ప్రొడ్యూసర్: బి. శివకుమార్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement