BA Raju
-
అభిమానిని తలుచుకొని ఎమోషనల్ అయిన సూపర్‌స్టార్ కృష్ణ
-
అభిమానిని తలుచుకొని ఎమోషనల్ అయిన సూపర్‌స్టార్ కృష్ణ
ప్రముఖ దివంగత నిర్మాత, పీఆర్ఓ బీఏ రాజు మొదటి వర్థంతి(మే21) సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ ఆయనను స్మరించుకున్నాడు. బీఏ రాజు తన అభిమాని అని.. ఆయనను తాను మద్రాసు తీసుకెళ్లాలని గుర్తు చేసుకున్నారు. ‘బీ ఏ రాజు నా అభిమాని. నేను బెజవాడ ఎప్పుడు వెళ్ళినా నన్ను కలిసేవాడు. ఫ్యాన్స్ మెయిల్ కి రిప్లై ఇవ్వడానికి నేనే అతన్ని మద్రాస్ తీసుకొచ్చాను. చాలా సంవత్సరాలు ఫ్యాన్ మెయిల్ కి రిప్లై ఇచ్చేవాడు. నాకు ఫ్యాన్స్ ని ఎక్కువగా డెవలప్ చేశాడు. ఆ తర్వాత నాకు జర్నలిస్ట్ అవ్వాలని ఉందండి, ఏదన్నా పేపర్ కు రెకమండ్ చేయండి అని అంటే నేనే జ్యోతిచిత్ర కు సిఫారసు చేశాను. తర్వాత రకరకాల పేపర్ లలో పని చేశాడు. ఇండస్ట్రీలో అందరితో పరిచయాలు పెంచుకుని జర్నలిస్ట్ గా చాలా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత సొంతంగా సూపర్ హిట్ పత్రిక పెట్టి, ఆ పత్రికను తెలుగు సినిమా పత్రికల్లో నంబర్ వన్ పత్రికగా తీర్చిదిద్దాడు. అమెరికా లో కూడా పాపులర్ అయ్యేంతగా సూపర్ హిట్ పత్రికను డెవలప్ చేశాడు . తర్వాత నిర్మాతగా సినిమాలు కూడా తీశాడు. చాలా అభివృద్ధి లోకి వచ్చి ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఇంత త్వరగా మనందరినీ విడిచి అతను వెళ్లిపోవడం చాలా బాధాకరం’ అని కృష్ణ అన్నారు. -
సింపుల్‌గా బీఏ రాజు కుమారుడి వివాహం.. ఫోటోలు వైరల్
BA Raju Son Siva Kumar Marriage Pics Goes Viral: ప్రముఖ దివంగత నిర్మాత బీఏ రాజు తనయుడు, డైరెక్టర్ శివకుమార్ వివాహబంధంలోకి అడుగుపెట్టాడు. స్నేహితురాలు లావణ్యతో ఆయన ఈనె 22న ఆయన పెళ్లి జరిగింది. శివకుమార్‌కు చాలా ఇష్టమైన సంఖ్య 22. అందుకే ఆయన తొలి చిత్రానికి సైతం శివకుమార్ ’22’ అనే పేరే పెట్టారు. ఇక 2022, జనవరి22వ తేదీ, 22 గంటలకు పెళ్లి చేసుకోవడం విశేషం. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఆయన వివాహం నిరాడంబరంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా శివకుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'పూణెకి చెందిన మరాఠీ అమ్మాయి, నా స్నేహితురాలు దండిగే లావణ్యతో వివాహం జరిగింది. మేం ఇద్దరం కలిసి మా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. మీ అందరి ఆశీస్సులు కావాలి' అంటూ పేర్కొన్నారు. ఇక కొత్త జంటకు పలువురు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. కాగా పూరి జగన్నాథ్, వివి. వినాయక్ వంటి టాప్ డైరెక్టర్స్ వద్ద సహాయ దర్శకుడిగా చేసిన శివకుమార్.. శివకుమార్ ’22’అనే సినిమా ద్వారా దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. Today Got Married To My Bestie Dandige Lavanya , Marathi Girl From Pune Settled In Hyderabad . Need All Your Blessings As We Start Our New Journey Together. Thanks & Love You All ❤️ pic.twitter.com/bH8Yu1tos3 — Shiva Kumar B (@ShivaKumarB22) January 22, 2022 -
రాజుగారి ద్వారానే ఎన్నో విషయాలు నేర్చుకున్నా: చిరు
టాలీవుడ్ పీఆర్వో బీఏ రాజు మృతి పట్ల ప్రముఖుల సంతాపం వెల్లువెత్తుతోంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరివాడిగా పేరున్న ఆయన.. ఇక లేరనే విషయాన్ని చాలామంది నమ్మలేకపోతున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి, బీఏ రాజులోని ప్రత్యేకతను గుర్తు చేసుకుంటూ నివాళి అర్పించాడు. మద్రాస్‌లో ఉన్నప్పుడు ఇండస్ట్రీ విషయాలెన్నో బీఏ రాజు తనతో పంచుకునేవారని, షూటింగ్ స్పాట్‌కి వచ్చి సరదాగా ముచ్చటించేవారని చిరు గుర్తుచేసుకున్నారు. అంతేకాదు ఇండస్ట్రీకి సంబంధించి కొత్త విషయాలెన్నో రాజుగారి ద్వారానే తెలుసుకున్నానని చెప్పారు. సినిమాలకు సంబంధించి కలెక్షన్ల దగ్గరి నుంచి ఎన్ని సెంటర్లు ఆడిందనే విషయాల దాకా ప్రతీ చిన్న కూడా అలవోకగా చెప్పే రాజుగారు.. సినీ ఇండస్ట్రీకి ఒక ఎన్సైక్లోపీడియా లాంటి వారని పొగడ్తలు గుప్పించాడు చిరంజీవి. బీఏ రాజు ఆత్మకు శాంతి కలగాలని కొరుకుంటూ, ఆయన కుటుంబానికి ట్విట్టర్ ద్వారా సానుభూతి తెలియజేశాడు. ఆత్మీయుడ్ని కోల్పోయా: సమంత బీఏరాజు మృతి పట్ల నటి సమంత అక్కినేని భావోద్వేగానికి లోనైంది. తన మొదటి సినిమా నుంచి ఆయన తన వెంటే ఉన్నారని, సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా తనతో ఆత్మీయంగా మాట్లాడేవారని గుర్తు చేసుకుంది. తన సినీ జీవితానికి బీఏ రాజు ఒక ఆశాకిరణంగా ఉన్నారని #RipBaRajuGaru హ్యాష్‌ట్యాగ్‌తో సమంత ట్వీట్ చేసింది. మరోవైపు హీరో ప్రభాస్ తన ఫేస్బుక్లో నివాళి అర్పించాడు. రాజుగారితో తాను పనిచేశానని, ఆయన తన ఇంటి మనిషి అని ప్రభాస్ ఎమోషనల్ అయ్యాడు. పదిహేను వందలకుపైగా సినిమాలకు పనిచేసిన బీఏరాజు మృతి దిగ్భ్రాంతి కలిగించిందని దర్శకుడు రాజమౌళి ట్వీట్ చేశాడు. మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్లు దేవీ శ్రీప్రసాద్, థమన్లు కూడా రాజు మృతిపట్ల నివాళి అర్పించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మహేష్‌బాబు భావోద్వేగం
ప్రముఖ సినీ జర్నలిస్ట్, పీఆర్వో బీఏ రాజు హాఠాన్మరణం యావత్ టాలీవుడ్‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నాలుగున్నర దశాబ్దాలుగా సినీరంగంలో ఉన్న ఆయనతో అనుబంధాన్ని పలువురు సెలబ్రిటీలు గుర్తుచేసుకుంటున్నారు. ముఖ్యంగా సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో ఆయన స్పెషల్ బాండింగ్ కొనసాగించారు. ఈ విషయాన్ని గుర్తు చేసుకుని మహేష్‌బాబు సోషల్ మీడియాలో ఎమోషన్ అయ్యాడు. ‘‘బీఏ రాజుగారు చిన్నప్పటి నుంచి ఆయన తెలుసు. ఆయనతో చాలా దగ్గరగా పనిచేశాను. సినీ పరిశ్రమలో ఆయనకొక జెంటిల్‌మ్యాన్. నిబద్ధతతో పనిచేసేవారు. ఆయన మరణాన్నితట్టుకోలేకపోతున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’’ అని ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో మహేష్‌బాబు పోస్ట్ చేశాడు. ఇక బీఏ రాజు మరణవార్త తెలియగానే షాక్‌కి గురయ్యానంటూ జూనియర్ ఎన్జీఆర్ ట్వీట్ చేశాడు. పీఆర్వోగా, జర్నలిస్ట్‌గా ఫిల్మ్ ఇండస్ట్రీకి గొప్పసేవలు ఆయన అందించాడని, రాజుగారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. దర్శకులు సంపత్ నంది, మెహర్ రమేష్‌లు, యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్, రైటర్ గోపీ మోహన్, దర్శకనిర్మాత మధురా శ్రీధర్ తదితరులు సోషల్ మీడియాలో బీఏ రాజు మృతి పట్ల నివాళులర్పించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Not able to process the sudden demise of BA Raju garu. I've known him since my childhood. We travelled together for many years and I worked with him very closely. pic.twitter.com/N6gbW8DPxv — Mahesh Babu (@urstrulyMahesh) May 21, 2021 The sudden demise of BA Raju Garu has left me in shock. As one of the most senior film journalists & PRO,he has contributed greatly to the Film Industry. I've known him since my earliest days in TFI. It is a huge loss.Praying for strength to his family. Rest in Peace Raju Garu 🙏🏻 pic.twitter.com/B5lytChlqW — Jr NTR (@tarak9999) May 22, 2021 -
తెలుగు చిత్రపరిశ్రమలో మరో తీవ్ర విషాదం..
సాక్షి, హైదరాబాద్: తెలుగు చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ జర్నలిస్ట్, నిర్మాత బీఏ రాజు హఠాన్మరణం చెందారు. గతకొద్ది రోజులుగా మధుమేహంతో బాధపడుతున్న ఆయనకు శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో కన్నుమూశారు. నాలుగున్నర దశాబ్ధాలుగా సినీ రంగంలో రాణిస్తున్న ఆయన, సినీ పత్రిక సూపర్‌హిట్ ద్వారా మంచి పేరు సంపాదించుకున్నారు. స్టార్ హీరోలకు, వందలాది చిత్రాలకు బీఏ రాజు పీఆర్వోగా పనిచేశారు. ఆయన భార్య జయ దర్శకత్వంలో పలు చిత్రాలు కూడా నిర్మించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) (చదవండి: కెమెరామ్యాన్ జయరాం కన్నుమూత) -
ప్రముఖ తెలుగు దర్శకుడు కన్నుమూత
తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు ఎన్ బీ చక్రవర్తి శుక్రవారం ఉదయం మరణించారు. ఈ మేరకు బీఏ రాజు ట్వీట్ చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చక్రవర్తి ఈ రోజు ఉదయం కన్ను మూశారని రాజు ట్వీట్ చేశారు. చక్రవర్తి శోభన్ బాబుతో 1984లో 'సంపూర్ణ ప్రేమాయణం', 1985-86లో నందమూరి బాలకృష్ణ నటించిన 'కత్తుల కొండయ్య', 'నిప్పులాంటి మనిషి' చిత్రాలకు దర్శకత్వం వహించారు. అలానే 1986లో వచ్చిన ‘కాష్మోరా’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, భానుప్రియ, శరత్‌బాబు కీలక పాత్రల్లో నటించారు. దర్శకుడు ఎన్ బి చక్రవర్తి నేడు ఉదయం అనారోగ్యం తో కన్నుమూశారు. ఆయన శోభన్ బాబు గారితో 'సంపూర్ణ ప్రేమాయణం', నందమూరి బాలకృష్ణ తో 'కత్తుల కొండయ్య', 'నిప్పులాంటి మనిషి', రాజేంద్రప్రసాద్, రాజశేఖర్ లతో 'కాష్మోరా' చిత్రాలకు దర్శకత్వం వహించారు. pic.twitter.com/BHGnfcRkNa — BARaju (@baraju_SuperHit) August 7, 2020 -
నాకు డబుల్ హ్యాపీ- బి.ఎ. రాజు
ఈ సినిమా ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను విడుదల చేసిన దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ – ‘‘నాతో కలిసి శివ చాలా సినిమాలకు పని చేశాడు. ఫస్ట్ టైమ్ డైరెక్టర్‌గా సినిమా చేశాడు.. నాకు బాగా కావాల్సినవాడు, చాలా ప్రతిభ ఉన్నవాడు.. తనపై నమ్మకం ఉంది. ‘22’ సినిమా చాలా బాగుంది. ఈ చిత్రం పెద్ద హిట్ సాధించాలి. శివ పెద్ద డైరెక్టర్ కావాలి. రూపేష్ కుమార్‌కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. వీవీ వినాయక్, పూరి జగన్నాథ్, మారుతిల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన శివకుమార్ బి. దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘22’. రూపేష్ కుమార్ చౌదరి, సలోని మిశ్రా జంటగా నటించారు. మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై సుశీలాదేవి నిర్మించారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం విలేకరుల సమావేశంలో నిర్మాత కొండా కృష్ణంరాజు మాట్లాడుతూ– ‘‘22’ చిత్రం టాకీని శివ 35 రోజుల్లో పూర్తి చేశాడు. ప్రీ ప్రొడక్షన్‌ని పకడ్బందీగా ప్లాన్ చేయడంతో పాటు తన మీద తనకు ఎంతో నమ్మకం ఉండటంవల్లే అంత త్వరగా షూటింగ్ పూర్తి చేయలిగాడు’ అన్నారు. శివకుమార్ మాట్లాడుతూ– ‘‘పూరీగారి దగ్గర పనిచేసే అవకాశం ఇచి్చనందుకు ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. టీజర్‌ని చూసి మా యూనిట్‌ని ఆయన అభినందించారు. ముఖ్యంగా సాయికార్తీక్ నేపథ్య సంగీతానికి బాగా ఇంప్రెస్ అయ్యారు’’ అన్నారు. ‘‘మా అబ్బాయి శివకి రూపే‹Ùలాంటి హీరో, ప్రొడ్యూసర్ దొరకడం అదృష్టం. మా అబ్బాయి శివ దర్శకుడు అయితే, మా అన్నయ్యగారి అబ్బాయి రవికిరణ్ ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్.. ఇద్దరూ ఒకే సినిమాకి చేయడం నాకు డబుల్ హ్యాపీ’’ అన్నారు నిర్మాత బి.ఎ.రాజు. ‘‘సాయికార్తీక్ నేపథ్య సంగీతం బాగా చేశారు. రవికిరణ్‌గారు మంచి విజువల్స్ ఇచ్చారు. షూటింగ్ అంతా చాలా సజావుగా జరిగింది’’ అన్నారు రూపే‹Ùకుమార్ చౌదరి. కెమెరామేన్ రవికిరణ్, సంగీత దర్శకుడు సాయి కార్తీక్, ఆర్ట్ డైరెక్టర్ పెద్దిరాజు మాట్లాడారు. -
దర్శకురాలు బి.జయ పార్థివ దేహానికి ప్రముఖుల నివాళి
-
జయకు సినీ ప్రముఖులు నివాళి
-
జయకు మహేష్ బాబు నివాళి
హైదరాబాద్: నందమూరి హరికృష్ణ మరణవార్తను జీర్ణించుకోక ముందే టాలీవుడ్ కు మరో షాక్ తగిలింది. జర్నలిస్ట్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, దర్శకత్వం వైపు అడుగులు వేసి చంటిగాడు సినిమా ద్వారా దర్శకురాలిగా తన ప్రతిభను నిరూపించుకున్న బి జయ గురువారం అర్ధరాత్రి గుండెపోటుతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ ఒక్కసారిగా షాక్ కు గురైంది. బి జయ మరణవార్త తెలుసుకున్న మహేష్ బాబు.. ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. జయ మరణం టాలీవుడ్ కు తీరని లోటని, జయలాంటి దర్శకురాలు టాలీవుడ్ కు అరుదుగా దొరుకుతుంటారని మహేష్ బాబు అన్నారు. బీఏ రాజు కుటుంబానికి మహేష్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మహేష్‌తో పాటు సీనియర్ హీరో వెంకటేష్, మంచు మనోజ్, ఆది, ఛార్మి, ఎస్వీ కృష్ణారెడ్డి, వంశీ పైడిపల్లి, గుణశేఖర్ తదితరులు ఆమెకు నివాళులు అర్పించారు. జయ ఆకస్మిక మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. దీనిలో భాగంగా జయతో తమకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. టాలీవుడ్ దర్శకురాలు మృతి (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
టాలీవుడ్ దర్శకురాలు మృతి
సాక్షి, హైదరాబాద్: తెలుగు సినీ దర్శకురాలు, డైనమిక్ లేడీ బి.జయ(54) గురువారం అర్ధరాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జయ ప్రముఖ పీఆర్వో బీఏ రాజు సతీమణి. జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె సూపర్ హిట్ అనే సినీవారపత్రికకు జనరల్ మేనేజర్‌గా పనిచేశారు. అనంతరం చంటిగాడు సినిమా ద్వారా దర్శకురాలిగా మారారు. ఆమె తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలం రావులపాలెంలో జన్మించారు. తెలుగు సినీ పరిశ్రమలో తనకో ప్రత్యేకతను సంపాదించుకున్నారు. చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం చిత్రాలకు ఆమె దర్శకత్వం వహించారు. ’వైశాఖం’చిత్రంతో ప్రేక్షకుల ప్రశంసలతోపాటు సిల్వర్ క్రౌన్ అవార్డ్‌ను అందుకున్నారు. -
సూపర్ హిట్ జర్నీ
పాత్రికేయుడిగా, ‘సూపర్‌హిట్’ పత్రికాధినేతగా, పీఆర్వోగా, నిర్మాతగా బీఏ రాజు జర్నీ సక్సెస్ఫుల్. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా కొత్త సినిమా విశేషాలను తెలియజేశారు. ‘చంటిగాడు, గుండమ్మగారి మనవడు, లవ్లీ, వైశాఖం’ వంటి చిత్రాలను తెరకెక్కించిన డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ. బి దర్శకత్వంలో ఆర్జే సినిమాస్ పతాకంపై బీఏ రాజు మరో సినిమా నిర్మించనున్నారు. ఆయన మాట్లాడుతూ – ‘‘నిర్మాతగా 15 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. మా బేనర్లో వచ్చిన సినిమాలను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. గతేడాది నిర్మించిన ‘వైశాఖం’ మంచి విజయం సొంతం చేసుకుంది. ఇప్పుడు మరో చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్కు శ్రీకారం చుట్టాం. స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. జూన్‌లో ప్రారంభించాలనుకుంటున్నాం’’ అన్నారు. -
స్పైడర్ కు సూపర్ స్టార్ ప్రశంసలు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం స్పైడర్. తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో తొలిసారిగా కోలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు మహేష్. మురుగదాస్ మార్క్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈసినిమాకు తెలుగు నాట డివైడ్ టాక్ వచ్చినా.. కోలీవుడ్ లో మాత్రం పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. అంతేకాదు స్పైడర్ సినిమాపై పలువురు కోలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పైడర్ చిత్రాన్ని చూసి చిత్రయూనిట్ ని అభినందించినట్టుగా పీఆర్వో బిఏరాజు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. 'సినిమా చాలా బాగుంది. యాక్షన్ తో పాటు మంచి మేసేజ్ కూడా ఈ సినిమాలో ఉంది. మురుగదాస్ అద్భుతంగా ఈ సబ్జెక్ట్ ను హ్యాండిల్ చేశారు. మహేష్ బాబు ఎక్స్ ట్రాడినరీగా పెర్ఫామ్ చేశారు. స్పైడర్ లాంటి సినిమాని ప్రేక్షకులకు అందించిన యూనిట్ సభ్యులందరికీ అభినందలు' అన్నారు రజనీకాంత్. Superstar #Rajinikanth watched #SPYder and praised Superstar @urstrulyMahesh's intense performance & @ARMurugadoss's direction pic.twitter.com/HCoAUGPRYj — BARaju (@baraju_SuperHit) 28 September 2017 -
శివుడి ఆశీస్సులతో ఆరంభం.. శివరాత్రికి పూర్తి
‘‘కీసరగుట్ట శివాలయంలో శివుడి ఆశీస్సులతో మా ‘వైశాఖం’ చిత్రీకరణ ప్రారంభమైంది. సరిగ్గా శివరాత్రికి చిత్రీకరణ పూర్తయింది’’ అని నిర్మాత బీఏ రాజు అన్నారు. హరీష్, అవంతిక జంటగా బి. జయ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘వైశాఖం’ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. రాజు మాట్లాడుతూ– ‘‘వైశాఖం’ ఓవర్సీస్ రైట్స్‌ను బ్లూ స్కై సంస్థ ఫ్యాన్సీ ఆఫర్‌కు సొంతం చేసుకుంది. నైజాం, ఆంధ్ర, సీడెడ్ ఏరియాల నుంచి బయ్యర్స్ చాలామంది వస్తున్నారు. స్పీడ్‌గా బిజినెస్ అవుతోంది’’ అన్నారు. ‘‘కథ ప్రకారం ఓ సన్నివేశంలో చండీయాగాన్ని శాస్త్రోక్తం గా జరిపించాం. అలా శివుడి అనుగ్రహం ఉన్న మా సినిమా శివరాత్రికి పూర్తవడం విశేషం. మంచి ఫీల్‌గుడ్ మూవీ ఇది’’ అని బి. జయ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వాలిశెట్టి వెంకటసుబ్బారావు, సంగీతం: డి.జె. వసంత్, లైన్ ప్రొడ్యూసర్: బి.శివకుమార్. -
రెండు... మూడేళ్లే అయినట్టుంది!
‘‘ఓ నిర్మాతగా సినిమాలోని కథకు న్యాయం చేస్తూ, కథను కథగా తీయాలని ప్రయత్నిస్తుంటాను. ఇప్పుడీ ‘వైశాఖం’ కూడా కథే మెయిన్ హీరోగా నడిచే సినిమా. మా సంస్థ నిర్మించిన చిత్రాలన్నిటిలోనూ ఉత్తమ చిత్రంగా నిలుస్తుంది’’ అన్నారు బీఏ రాజు. హరీశ్, అవంతిక జంటగా బి. జయ దర్శకత్వంలో ఆర్.జె. సినిమాస్ పతాకంపై ఆయన నిర్మించిన సినిమా ‘వైశాఖం’. నేడు నిర్మాత బీఏ రాజు పుట్టినరోజు. ఆయన మట్లాడుతూ – ‘‘విలేకరిగా ప్రయాణం ప్రారంభించి, పీఆర్వోగా, పత్రికాధినేతగా, నిర్మాతగా చిత్ర పరిశ్రమలో నాకంటూ ఓ స్థానం ఏర్పరుచుకున్నాను. నా విజయం వెనుక నా సతీమణి బి. జయ మద్దతు ఎంతో ఉంది. ఇన్నేళ్లుగా పనిచేస్తున్నా కెరీర్ స్టార్ట్ చేసి రెండు మూడేళ్ళే అయినట్టుంది. ప్రతిరోజూ చేసే పనిని ఇష్టంగా చేయడం నా పాలసీ. ‘వైశాఖం’ చిత్రానికి వస్తే ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ మా సంస్థ నిర్మించిన సినిమాలు బయ్యర్లకు లాభాలు తీసుకురావడంతో ‘వైశాఖం’ బిజినెస్ బాగా జరిగింది. ఈ సినిమా విడుదలకు ముందే మరో సినిమా ప్రారంభిస్తా’’ అన్నారు. -
చిన్న చిత్రాల్లో కొత్త ట్రెండ్ : బీఏ రాజు
‘‘ప్రేమ, వినోదంతో పాటు మంచి సందేశం ఉన్న చిత్రమిది. చిన్న చిత్రాల్లో మా ‘వైశాఖం’ కొత్త ట్రెండ్ సృష్టిస్తుంది’’ అన్నారు నిర్మాత బీఏ రాజు. హరీశ్, అవంతిక జంటగా బి.జయ దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్న చిత్రం ‘వైశాఖం’. నవంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దర్శకురాలు బి.జయ మాట్లాడుతూ - ‘‘అపార్ట్మెంట్స్ నేపథ్యంలో రూపొందించిన కుటుంబ కథా చిత్రమిది. ‘వైశాఖం’ పేరులో ఎంత మంచి ఫీల్ ఉందో.. సినిమా కూడా అంతే మంచి ఫీల్ ఇస్తుంది. కథలో ప్రతి పాత్రకూ ప్రాముఖ్యత ఉంటుంది’’ అన్నారు. బీఏ రాజు మాట్లాడుతూ - ‘‘ఇటీవల కొత్త కథలతో వస్తున్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఆ జాబితాలో మా చిత్రం చేరుతుంది. రెండు రోజులు మినహా చిత్రీకరణ పూర్తయింది’’ అన్నారు. హీరో హరీశ్, సంగీత దర్శకుడు డీజే వసంత్, సినిమాటోగ్రాఫర్ వాలిశెట్టి వెంకటసుబ్బారావు, లైన్ ప్రొడ్యూసర్ శివ తదితరులు పాల్గొన్నారు. -
అందరికీ నచ్చేలా వైశాఖం
మహిళా దర్శకుల్లో ‘డైనమిక్’ అనిపించుకున్న వాళ్లల్లో జయ బి. ఒకరు. ఆమె దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘వైశాఖం’. హరీశ్, అవంతిక జంటగా ఆర్జే సినిమాస్ పతాకంపై బీఏ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ అరవైశాతం పూర్తయింది. ఈ నెల 20న మూడో షెడ్యూల్ మొదలవుతుంది. జయ బి. మాట్లాడుతూ- ‘‘నైట్ ఎఫెక్ట్‌లో ఓ ఫైట్, కీలక సన్నివేశాలు ఈ షెడ్యూల్లో చిత్రీకరించబోతున్నాం. సరికొత్త కథాంశంతో అన్ని వర్గాలవారినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. హీరో, హీరోయిన్స్‌తో పాటు అన్ని పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుంది’’ అన్నారు. ‘‘యువతను, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కిస్తున్నాం. చిత్రీకరణలో ఎక్కడా రాజీ పడకుండా హై బడ్జెట్లో తెరకెక్కిస్తున్నాం. పాటలు చాలా బాగా వచ్చాయి’’ అని బీఏ రాజు చెప్పారు. సాయికుమార్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: డీజే వసంత్, లైన్ ప్రొడ్యూసర్: బి. శివకుమార్. -
మరో కొత్త ప్రయత్నం
ప్రేమలో పావనీ కల్యాణ్, చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మ గారి మనవడు, లవ్లీ వంటి చిత్రాలు నిర్మించిన నిర్మాత బి.ఎ. రాజు మరో సినిమా నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. బి. జయ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. నేడు బి.ఎ. రాజు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘మంచి స్క్రిప్టు సిద్ధం చేశాం. వాణిజ్య అంశాలతో పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఉంటుంది. అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను రూపొందిస్తాం. ఫిబ్రవరిలో మొదలుపెడతాం. తారాగణం, సాంకేతికవర్గ వివరాలు త్వరలోనే తెలియజేస్తాం’’ అని తెలిపారు. -
7/జి, బందావన్ కాలనీ సినిమా తరహాలో...
చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, లవ్లీ చిత్రాల ద్వారా నిర్మాతగా కూడా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ పాత్రికేయుడు బి.ఎ.రాజు. ఈ ఏడాది ఆయన రెండు చిత్రాలను నిర్మించడానికి సంసిద్ధమయ్యారు. నేడు బి.ఎ.రాజు పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన భవిష్యత్ ప్రణాళికల గురించి విలేకరులతో ముచ్చటించారాయన. ‘‘సూపర్‌హిట్ ఫ్రెండ్స్ పతాకంపై మేం నిర్మించిన చిత్రాలన్నీ విజయాలను అందుకున్నాయి. ఆర్.జె.సినిమాస్ పతాకంపై మేం నిర్మించిన ‘లవ్లీ’ చిత్రమైతే... పెద్ద సినిమాల మధ్య విడుదలై ఘన విజయాన్ని సాధించింది. నిర్మాతగా నాకెంతో సంతప్తి కలిగిస్తున్న విషయం అది. ఆర్.జె.పతాకంపై ఈ ఏడాది రెండు సినిమాలు నిర్మించనున్నాం. రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో ఒకటి ప్రేమిస్తే, 7/జి బందావన్ కాలనీ చిత్రాల్లా ఇంటెన్సిటీ ఉన్న కథ. అంతా కొత్తవారితో ఈ సినిమా తీయనున్నాం. మార్చిలో సెట్స్‌కి వెళ్తాం. మరో సినిమా యంగ్ హీరోతో ఉంటుంది. సెంటిమెంట్, కామెడీ ప్రధానంగా సాగే సినిమా ఇది. ఈ సినిమాలకు సంబంధించిన నటీనటులు,సాంకేతికనిపుణుల వివరాలు త్వరలో ప్రకటిస్తాం’’ అని తెలిపారు.