టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం స్పైడర్. తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో తొలిసారిగా కోలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు మహేష్. మురుగదాస్ మార్క్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈసినిమాకు తెలుగు నాట డివైడ్ టాక్ వచ్చినా.. కోలీవుడ్ లో మాత్రం పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.
అంతేకాదు స్పైడర్ సినిమాపై పలువురు కోలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పైడర్ చిత్రాన్ని చూసి చిత్రయూనిట్ ని అభినందించినట్టుగా పీఆర్వో బిఏరాజు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. 'సినిమా చాలా బాగుంది. యాక్షన్ తో పాటు మంచి మేసేజ్ కూడా ఈ సినిమాలో ఉంది. మురుగదాస్ అద్భుతంగా ఈ సబ్జెక్ట్ ను హ్యాండిల్ చేశారు. మహేష్ బాబు ఎక్స్ ట్రాడినరీగా పెర్ఫామ్ చేశారు. స్పైడర్ లాంటి సినిమాని ప్రేక్షకులకు అందించిన యూనిట్ సభ్యులందరికీ అభినందలు' అన్నారు రజనీకాంత్.
Superstar #Rajinikanth watched #SPYder and praised Superstar @urstrulyMahesh's intense performance & @ARMurugadoss's direction pic.twitter.com/HCoAUGPRYj
— BARaju (@baraju_SuperHit) 28 September 2017