ఒకే వేదికపై ఇద్దరు సూపర్ స్టార్లు..!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న స్పైడర్ సినిమాను తెలుగుతో పాటు తమిళ్ లోనూ గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ హీరోగా రిలీజ్ అవుతున్న తొలి తమిళ సినిమా కావటంతో సూపర్ స్టార్ ను కోలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు ఓ భారీ వేడుకను ప్లాన్ చేస్తున్నారు. స్టార్ వారసులను పరిచయం చేసేందుకు ఏర్పాటు చేసే వేడుక తరహాలో తమిళనాట భారీగా ఆడియో రిలీజ్ చేయాలని నిర్ణయించారు.
ఈ కార్యక్రమానికి హైప్ తీసుకువచ్చేందుకు సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ను వేడుకకు ఆహ్వానిస్తున్నారట. రజనీ హీరోగా తెరకెక్కుతున్న 2.0 సినిమాను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ సంస్థ స్పైడర్ సినిమాను రిలీజ్ చేస్తుండటంతో రజనీ, స్పైడర్ వేడుకలో పాల్గొనటం ఖాయంగా కనిపిస్తుంది. ప్రతినాయకులుగా తమిళ నటులు ఎస్ జె సూర్య, భరత్ లు నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కు రెడీ అవుతోంది.