Mahesh Babu, Jr NTR Makeover For Their Next Movie, See New Look - Sakshi
Sakshi News home page

స్టార్స్‌ మేకోవర్‌, న్యూ లుక్కు.. వెరీ కిక్కు

Published Sun, Aug 21 2022 8:51 AM | Last Updated on Sun, Aug 21 2022 12:04 PM

Mahesh Babu, Jr NTR Makeover For Their Next Movie, See New Look - Sakshi

అభిమాన హీరోలు కొత్తగా కనబడితే ఫ్యాన్స్‌కి ఓ కిక్‌. అయితే ప్రతి సినిమాకీ కొత్తగా కనిపించడం కుదరదు. వెరైటీ క్యారెక్టర్‌ చేసినప్పుడు కొత్త లుక్‌ ట్రై చేస్తుంటారు. సూపర్‌ స్టార్‌ ట్యాగ్‌ ఉన్న ఇద్దరు హీరోలు రజనీకాంత్, మహేశ్‌బాబు ఇప్పుడు కొత్త హెయిర్‌ స్టయిల్‌ ట్రై చేస్తున్నారు. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఫిజిక్‌ని మార్చుకుంటున్నారు. ఇంకా నేచురల్‌ స్టార్‌ నానీతో పాటు మరికొందరు హీరోలు కూడా ఫిజికల్‌గా మేకోవర్‌ అయ్యారు. ‘న్యూ లుక్కు.. వెరీ కిక్కు’ అంటూ వీరు కనిపించనున్న చిత్రాల గురించి తెలుసుకుందాం.

రజనీకాంత్‌ చాలా సింపుల్‌.. తెల్ల జుట్టు, నెరిసిన గడ్డంతోనే కనిపిస్తారు. కానీ సినిమాల్లో నల్లటి విగ్గుతో స్టయిలిష్‌గా కనబడతారు. అయితే ఇప్పటివరకూ కనిపించినట్లుగా కాకుండా ‘జైలర్‌’ సినిమాలో కొత్త రకం హెయిర్‌ స్టయిల్‌తో ఆకట్టుకోనున్నారు. ముంబైకి చెందిన హెయిర్‌ స్టయిలిస్ట్‌ హకీమ్‌ అలీమ్‌ ఈ సూపర్‌ స్టార్‌ని కొత్త రకం హెయిర్‌ స్టయిల్‌లో చూపించనున్నారు. రజనీతో హకీమ్‌ ఓ ఫొటో దిగి, కొత్తగా చూపించనున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా చెప్పినప్పటి నుంచి ఈ సినిమాలో తమ అభిమాన హీరో గెటప్‌ విడుదల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

చదవండి: నెట్టింట దుమారం రేపుతున్న అనసూయ ట్వీట్‌.. ఉలిక్కిపడ్డ యాంకరమ్మ

అయితే దానికి ఇంకా సమయం ఉంది. ఎందుకంటే ఇంకా షూటింగే ఆరంభం కాలేదు. ఈ చిత్రానికి నెల్సన్‌  దిలీప్‌కుమార్‌ దర్శకత్వం వహించనున్నారు. ఇక తెలుగు విషయానికొస్తే.. సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌లో కనిపించనున్నారు మహేశ్‌బాబు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటించనున్న సినిమాలో అక్కడక్కడా తెల్ల జుట్టుతో కొత్తగా కనిపించనున్నారు మహేశ్‌. రజనీకి హెయిర్‌ స్టయిల్‌ చేస్తున్న హకీమ్‌ అలీమ్‌నే మహేశ్‌కి ఈ హెయిర్‌ స్టయిల్‌ చేస్తున్నారు. ఆ ఫొటోను నాలుగైదు రోజుల క్రితం సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశారు కూడా. ఇక ‘శనివారం ఉదయం ఇలా కూల్‌గా పూల్‌లో’ అంటూ చొక్కా లేకుండా మహేశ్‌బాబు ఓ ఫొటో షేర్‌ చేశారు. కొంచెం బీస్ట్‌ (దృఢంగా) లుక్‌లో కనిపించారు.    

దాంతో త్రివిక్రమ్‌ సినిమాలో కొత్త హెయిర్‌ స్టయిల్‌లోనే కాదు.. ఫిజిక్‌ పరంగా కూడా కొత్తగా కనిపించనున్నారని ఊహించవచ్చు. పైగా మేకోవర్‌ కోసం ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ లాయిడ్‌ స్టీవెన్స్‌ని నియమించుకున్నారు మహేశ్‌. ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత నెక్ట్స్‌ సినిమా షూటింగ్‌లోకి ఎంటరయ్యేలోపు ఫ్యామిలీతో వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తూ మరోవైపు మేకోవర్‌ మీద కూడా దృష్టి పెట్టారట ఎన్టీఆర్‌. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ స్లిమ్‌ లుక్‌లో కనిపిస్తారట. దాదాపు పది కిలోలు బరువు తగ్గాలని టార్గెట్‌గా పెట్టుకున్నారని భోగట్టా. అలాగే ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో చేయనున్న సినిమాలో ఎన్టీఆర్‌ డార్క్‌ మేకప్‌తో డిఫరెంట్‌గా కనిపించనున్నారు.

చదవండి: కరీనాకు ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ డైరెక్టర్‌ చురక, ఆమె కామెంట్స్‌పై ఘాటు స్పందన

మరోవైపు గోదావరి ఖనిలోని బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందుతున్న ‘దసరా’ చిత్రం కోసం నాని పూర్తిగా మారిపోయారు. ఈ చిత్రంలో ఊర మాస్‌లో లుక్‌లో నాని కనిపిస్తారు. కొంచెం పెరిగిన జుట్టు, బరువు తగ్గిన ఫిజిక్‌తో నాని మేకోవర్‌ అయ్యారు. ఈ చిత్రానికి శ్రీకాంత్‌ ఓదెల దర్శకుడు.   ఇంకోవైపు ‘ఏజెంట్‌’ కోసం అఖిల్‌ సిక్స్‌ ప్యాక్‌ ఫిజిక్‌కి మారిపోయారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే ఈ నెల 25న విడుదల కానున్న ‘లైగర్‌’లో బాక్సర్‌లా కనిపించడానికి విజయ్‌ దేవరకొండ ఫిజిక్‌ని మార్చుకున్నారు. ఇంకా పలువురు హీరోలు పాత్రకి తగ్గట్టు లావుగా లేక సన్నగా కనిపించే ప్రయత్నాల్లో ఉన్నారు. హెయిర్‌ స్టయిల్‌ పరంగానూ ప్రయోగాలు చేస్తున్నారు. ఈ కొత్త మేకోవర్‌ ఫ్యాన్స్‌కి కిక్కో కిక్కు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement