ప్రముఖ తెలుగు దర్శకుడు కన్నుమూత | Movie Director N B Chakravarthy Death | Sakshi
Sakshi News home page

కాష్మోరా చిత్ర దర్శకుడు ఎన్‌ బీ చక్రవర్తి మృతి

Published Fri, Aug 7 2020 4:01 PM | Last Updated on Fri, Aug 7 2020 4:31 PM

Movie Director N B Chakravarthy Death - Sakshi

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు ఎన్‌ బీ చక్రవర్తి శుక్రవారం ఉదయం మరణించారు. ఈ మేరకు బీఏ రాజు ట్వీట్‌ చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చక్రవర్తి ఈ రోజు ఉదయం కన్ను మూశారని రాజు ట్వీట్‌ చేశారు. చక్రవర్తి శోభన్ బాబుతో 1984లో 'సంపూర్ణ ప్రేమాయణం', 1985-86లో  నందమూరి బాలకృష్ణ నటించిన 'కత్తుల కొండయ్య', 'నిప్పులాంటి మనిషి' చిత్రాలకు దర్శకత్వం వహించారు. అలానే 1986లో వచ్చిన ‘కాష్మోరా’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, భానుప్రియ, శరత్‌బాబు కీలక పాత్రల్లో నటించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement