ఈ వీడియోలో ఉన్న చెత్త ఎవరు?.. బాలకృష్ణపై స్టార్‌ డైరెక్టర్‌ ఫైర్! | Hansal Mehta Asks After Watching Balakrishna Video Pushed Anjali On Stage | Sakshi
Sakshi News home page

Hansal Mehta: ఈ వీడియోలో ఉన్న చెత్త ఎవరు?.. బాలకృష్ణపై హన్సల్‌ మెహతా పోస్ట్‌ వైరల్!

Published Fri, May 31 2024 3:40 PM | Last Updated on Fri, May 31 2024 5:25 PM

Hansal Mehta Asks After Watching Balakrishna Video Pushed Anjali On Stage

టాలీవుడ్‌ హీరో నందమూరి బాలకృష్ణపై విమర్శలు ఆగడం లేదు. ఇటీవల ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో హీరోయిన్‌ అంజలిని పక్కకు నెట్టడంతో మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తోటి మహిళా నటి పట్ల ఆయన వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియా వేదికగా పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. తాజాగా ఈ వీడియో చూసిన బాలీవుడ్‌ డైరెక్టర్‌ హన్సల్‌ మెహతా.. అసలు ఆయన ఎవరంటూ కామెంట్స్ చేశారు. ఎవరీ చెత్త అంటూ ఆ వీడియోను చూసి రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

కాగా..హన్సల్ మెహతా ప్రస్తుతం కరీనా కపూర్  ప్రధాన పాత్రలో  ది బకింగ్‌హామ్ మర్డర్స్ అనే చిత్రాన్ని నిర్మించారు. అంతే కాకుండా ప్రతిక్ గాంధీ లీడ్‌ రోల్‌లో  దేద్ బిఘా జమీన్‌ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా మే 31 న విడుదల కానుంది. ఇటీవలే  స్కామ్ 2010: ది సుబ్రతా రాయ్ చిత్రం కూడా ప్రకటించారు. ఇది తమల్ బందోపాధ్యాయ రచించిన సహారా: ది అన్‌టోల్డ్ స్టోరీ అనే పుస్తకం ఆధారంగా రూపొందించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement