anajli
-
ఈ వీడియోలో ఉన్న చెత్త ఎవరు?.. బాలకృష్ణపై స్టార్ డైరెక్టర్ ఫైర్!
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణపై విమర్శలు ఆగడం లేదు. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ అంజలిని పక్కకు నెట్టడంతో మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తోటి మహిళా నటి పట్ల ఆయన వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియా వేదికగా పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. తాజాగా ఈ వీడియో చూసిన బాలీవుడ్ డైరెక్టర్ హన్సల్ మెహతా.. అసలు ఆయన ఎవరంటూ కామెంట్స్ చేశారు. ఎవరీ చెత్త అంటూ ఆ వీడియోను చూసి రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.కాగా..హన్సల్ మెహతా ప్రస్తుతం కరీనా కపూర్ ప్రధాన పాత్రలో ది బకింగ్‌హామ్ మర్డర్స్ అనే చిత్రాన్ని నిర్మించారు. అంతే కాకుండా ప్రతిక్ గాంధీ లీడ్ రోల్లో దేద్ బిఘా జమీన్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా మే 31 న విడుదల కానుంది. ఇటీవలే స్కామ్ 2010: ది సుబ్రతా రాయ్ చిత్రం కూడా ప్రకటించారు. ఇది తమల్ బందోపాధ్యాయ రచించిన సహారా: ది అన్‌టోల్డ్ స్టోరీ అనే పుస్తకం ఆధారంగా రూపొందించనున్నారు. Who is this scumbag? https://t.co/KUVZjMZY2M— Hansal Mehta (@mehtahansal) May 29, 2024 -
Delhi: అంజలి సింగ్ కేసులో మరో ఇద్దరి ప్రమేయం!
న్యూఢిల్లీ: దేశ రాజధాని నడిబొడ్డున దారుణ రీతిలో ప్రాణం పోగొట్టుకున్న అంజలి సింగ్(20) కేసు కీలక మలుపులు తిరుగుతోంది. పీకలదాక మద్యం సేవించి యువతి ప్రాణాలు కోల్పోయేందుకు కారణమైన ఐదుగురిని ఇప్పటికీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో మరో ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సీటీటీవీ దృశ్యాల ఆధారంగా ఈ కేసుకు సంబంధం ఉందని అనుమానిస్తున్న ఆశుతోశ్, అంకుశ్‌లను త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఢిల్లీ పోలీసులు గురువారం వెల్లడించారు. ‘కస్టడీలో ఉన్న ఐదుగురు కాకుండా మరో ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. మా వద్ద సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయి. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు వారు ప్రయత్నాలు చేశారు.’అని వెల్లడించారు సీనియర్ పోలీసు అధికారి సాగర్‌ప్రీత్ హుడా. కారు నడిపినట్లు మొదటి నుంచి భావిస్తున్న దీపక్ ఖన్నా కాదని, అమిత్ ఖన్నాగా పేర్కొన్నారు. అమిత్‌కు డ్రైవింగ్ లైసెన్స్ లేదని గుర్తించినట్లు చెప్పారు. #दिल्ली - कंझावला मामले में एक और नया सीसीटीवी आया सामने, जिसमें पांचो अरोपी कार से उतरते नज़र आए...#Delhiaccident #DelhiPolice #KanjhawalaDeathCase #Kanjhawala #Delhi #Delhiaccident #Nidhi #Kanjhawala #kanjhawalaaccident #Kanjhawala_girl_accident #KanjhawalaHorror pic.twitter.com/0qqrjlNw2N — TheuttarpradeshNews.com (@TheUPNews) January 5, 2023 ఇదీ చదవండి: అంజలి సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్!.. నిధి అసలు ఫ్రెండే కాదట! -
Delhi: అంజలి సింగ్ కేసులో ఊహించని మలుపు!
ఢిల్లీ: దేశ రాజధాని నడిబొడ్డున దారుణ రీతిలో ప్రాణం పొగొట్టుకుంది అంజలి సింగ్(20). తాగుబోతుల నిర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం.. నరకం అనుభవిస్తూ విగతజీవిగా మారింది. ఢిల్లీని కుదిపేసిన సుల్తాన్‌పురి కేసు.. నిరసనలతో కేంద్రంలోనూ కదలికలు తీసుకొచ్చింది. అయితే పోలీసు దర్యాప్తు పట్ల బాధిత కుటుంబం సంతృప్తిగా ఉన్నా.. తాజాగా వాళ్లు ఇచ్చిన ఓ స్టేట్మెంట్ ఈ హిట్ అండ్ రన్ కేసును మరో మలుపు తిప్పేలా కనిపిస్తోంది. ఘటన సమయంలో అంజలితో పాటు ఉన్న నిధి అనే స్నేహితురాలి స్టేట్మెంట్ ఈ కేసులో కీలకంగా మారిన సంగతి తెలిసిందే కదా. అయితే తమ కూతురికి నిధి అనే స్నేహితురాలు లేనేలేదని అంజలి తల్లి రేఖా దేవి మీడియాకు తెలిపింది. అంతేకాదు.. ఆరోజు అంజలి ఆల్కాహాల్ తీసుకుందని మీడియా సాక్షిగా నిధి చెప్పిన మాటలపైనా ఆమె మండిపడ్డారు. ‘‘నిధి అనే అమ్మాయిని నేను, మా ఇంట్లో వాళ్లం ఎప్పుడూ చూడలేదు. ఆమె ఎప్పుడూ మా ఇంటికి రాలేదు. అలాంటి స్నేహితురాలు మా అమ్మాయికి లేదు. తను అబద్ధం చెప్తోంది. నా కూతురు జీవితంలో ఎప్పుడూ ఆల్కహాల్ తీసుకోలేదు. నిధి అబద్ధం చెబుతోంది. పోలీసులు ఆమెను గట్టిగా విచారిస్తే.. అసలు విషయాలు బయటపడ్తాయి’’ అని రేఖా దేవి విజ్ఞప్తి చేస్తోంది. ఇక అంజలి మేనమామ మాట్లాడుతూ.. ‘‘ఆమె అబద్ధం చెప్తున్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. అంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు అసలామె ఎందుకు పట్టనట్లు ఉంది. పోలీసులకు కాదు కదా తన ఇంట్లో వాళ్లకైనా ఎందుకు చెప్పలేదు. ఇది ప్రమాదం కాదు.. ముమ్మాటికీ హత్యే. నిధి పై కూడా హత్యానేరం నమోదు చేయాలి. నిందితులకు ఆమెకు ఏమైనా సంబంధాలు ఉన్నాయేమో గుర్తించాలి’’ ఆయన పోలీసులను కోరుతున్నాడు. ఇదిలా ఉంటే అంజలి ఫ్యామిలీ డాక్టర్ భూపేష్.. ఆమెకు మద్యం తీసుకునే అలవాటు లేదని చెప్పాడు. అదే సమయంలో పోస్ట్‌మార్టం నివేదికలో ఆమె శరీరంలో ఆనవాలు లేదని తేలిన విషయాన్ని గుర్తు చేశారు. ఘటనకు ముందు హోటల్లో ఆమె తీసుకున్న ఆహారం ఆనవాలు మాత్రమే కడుపులో ఉన్నట్లు నివేదికలో వెల్లడైన విషయాన్ని డాక్టర్ భూపేష్ చెప్తున్నారు. నిధి స్టేట్మెంట్.. నిధి పోలీసులకు, మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటనకు ముందు కొత్త ఏడాది స్వాగతం పలుకుతూ జరిగిన పార్టీలో అంజలి మద్యం సేవించింది. ఆపై ఇద్దరం స్కూటీపై బయల్దేరాం. నేను వెనకాల కూర్చున్నా. ఘటన జరిగిన సమయంలో స్కూటీని ఢీ కొట్టిన కారులో ఎలాంటి మ్యూజిక్ ప్లే కావడం లేదు. స్కూటీని ఢీ కొట్టాక.. అంజలి కాలు కారు కింద ఇరుక్కుంది. ఆమె నొప్పితో గట్టిగట్టిగా అరిచింది. ఆమె కారు కింద చిక్కుకుందని లోపల ఉన్నవాళ్లకు తెలుసు. కానీ, స్లో చేయడం గానీ, ఆమెను రక్షించే ప్రయత్నంగానీ చేయకుండా ఏం పట్టన్నట్లు లాక్కుని వెళ్లిపోయారు. ఆ సమయంలో నాకు భయం వేసింది. ఆ ప్రమాదానికి నన్నే నిందిస్తారనే భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయా.. అంతే! అని నిధి మీడియాకు తెలిపింది. She is Nidhi who was with #AnjaliSingh during the fateful New Year's night. She reportedly left the spot after Anjali's scooty was hit by Baleno car. Nidhi told @DelhiPolice she was sitting pillion & escaped with minor injuries. Quite strange @AlokReporter @TheNewIndian_in pic.twitter.com/S6u9Iechkc — Pramod Kumar Singh (@SinghPramod2784) January 4, 2023 సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిధిని ట్రేస్ చేసిన పోలీసులు ఆమె నుంచి వాంగ్మూలం సేకరించారు. ఘటన స్థలం నుంచి 150 మీటర్ల దూరంలోని ఓ గల్లీలో ఆమె(నిధి) వెళ్తుండగా.. అక్కడి సీసీటీవీలో రికార్డు అయ్యింది. ఇదిలా ఉంటే.. అంజలి ఘటనలో నిధి వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక మరోవైపు ఐదుగురు నిందితులు ఘటన సమయంలో తాము మద్యం మత్తులో ఉన్నామని, కారులో ఫుల్ సౌండ్ ఉన్నందున అంజలి కారు కింద ఉన్న విషయం గమనించలేకపోయామని చెప్తున్నారు. A car dragged a girl for a few Kms after hitting her two-wheeler in #Delhi's #Kanjhawala. The girl, #AnjaliSingh, died & her naked body was found later. The accused have been identified as Deepak Khanna, Amit Khanna, Krishan, Mithun & Manoj Mittal. pic.twitter.com/aP3adlKkFR — Sarthak Rohilla (@SarthakRohilla2) January 2, 2023 అయితే.. ప్రధాన నిందితుడు, డ్రైవర్ సీట్లో ఉన్న దీపక్ ఖన్నా మాత్రం కారు దేని మీద నుంచో వెళ్తున్నట్లు అనిపించిందని చెప్పగా, మిగతా వాళ్లు మాత్రం తాము అలాంటిదేం గుర్తించలేదని పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చారు. -
ఎంతపని చేశావమ్మా..
బేటీ బచావోలో ఇప్పటి వరకు ప్రస్తావనకు వచ్చిన ఆడబిడ్డల్లో చాలామంది కన్నవారి పాపానికి బలైనవారే! శంషాబాద్‌కి చెందిన ఈ బిడ్డలూ అంతే! అంజలి, అరుణ అక్కాచెల్లెళ్లు. అంజలి ఆరో తరగతి, అరుణ అయిదో తరగతి. చిన్న కుటుంబం.. కానీ చింతలు లేని కుటుంబం కాదు. వీళ్ల నాన్న ఏదో కేసులో జైలుకి వెళ్లాడు. ఆయనను బెయిల్ మీద బయటకు తీసుకురావడానికి నానా ప్రయత్నాలు చేసింది అంజలి వాళ్ల అమ్మ. మిగిలిన ప్రయత్నాలు ఎలా ఉన్నాయో తెలియదు కానీ ఒక ప్రయత్నం మాత్రం ఘోరమైంది. ఏంటది? భర్త బెయిల్ కోసం రూ.10 వేలు అవసరమయ్యాయి ఆమెకు. ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఇద్దరు బిడ్డలపై కన్నుపడింది. వెంటనే ప్లాన్ చేసుకుంది. ‘అవసరం’ ఉన్న వాళ్ల గురించి ఆరా తీసింది. ఓ వ్యక్తి దొరికాడు. పిల్లల ఫొటోలు చూపించింది. బేరం మొదలుపెట్టింది. పదివేలకు బేరం కుదుర్చుకుంది. పిల్లలు చదివే స్కూల్ అడ్రస్, వాళ్ల పేర్లు, చదువుతున్న క్లాస్ వివరాలనూ ఆ వ్యక్తికి చెప్పి డబ్బులు తీసుకుని వెళ్లిపోయింది.ఈ తతంగమంతా జరుగుతున్నప్పుడు అంజలి, అరుణ.. ఇద్దరూ స్కూల్లో ఉన్నారు. మధ్యాహ్నం.. పదివేలు తీసుకున్న వ్యక్తి నేరుగా ఆ పిల్లల స్కూల్‌కి వెళ్లి, పిల్లల పేర్లు చెప్పి తనతో పంపించమని టీచర్ని అడిగాడు. ఇంత హఠాత్తుగా పిల్లల్ని తీసుకెళ్లే కారణమేంటో చెప్పమని అడిగింది టీచర్. ఎవరికో ఒంట్లో బాగాలేదు పిల్లల్ని తీసుకొని అర్జెంట్‌గా ఊరెళ్లాలి అని చెప్పాడు ఆ వ్యక్తి. ఎందుకో ఆ టీచర్‌కి ఆయన మీద అనుమానం వచ్చింది. ‘అసలు పిల్లలకి నువ్వేమవుతావ్?’ అని అడిగింది టీచర్. ‘నా పిల్లలు’ అని చెప్పాడు. పొంతన కుదిరినట్టు అనిపించలేదు.. ఇంకా వివరాలను ఆరాతీసే ప్రయత్నం చేసింది. పంపించమంటే ఇన్ని ప్రశ్నలేస్తున్నారేంటి అని ఆవేశపడ్డాడు. అది చూసి టీచర్ మనసు కీడు శంకించింది. పట్టుబట్టి అడిగితే పట్టుబడిపోయాడు. ఆ పిల్లల అమ్మ పదివేల రూపాయలకు వాళ్లను తనకు అమ్మేసిందన్న నిజం కక్కేశాడు. అవాక్కయింది టీచర్. స్కూల్ మేనేజ్మెంట్కి విషయం తెలియజేసింది. వాళ్లమ్మకు ఫోన్ చేశారు. ‘అవును.. నా పిల్లలు నా యిష్టం. నా భర్త బెయిల్ కోసం అమ్మేసుకున్నాను. అతనితో పంపించండి’ అని కటువుగా సమాధానమిచ్చింది. పోలీసులకు ఫోన్ చేసింది యాజమాన్యం. అమ్మతో పాటు, కొనుక్కున్న వ్యక్తి కటకటాల్లో ఉన్నారు. అమ్మ చేసిన పనికి పసివాళ్లు షాక్‌కి గురయ్యారు. పిల్లలను కస్తూర్బాలో చేర్పించారు. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న అక్కాచెల్లెళ్లు చదువు మీదే దృష్టి పెట్టారు. దేన్నీ పట్టించుకునే స్థితిలో లేరు! ‘అయ్యో..’ అని అంజలి, అరుణను జాలి ఊబిలోకి నెట్టేయకుండా.. ధైర్యంగా నిలబెట్టే ప్రయత్నాలు చేద్దాం! వాళ్ల హక్కుల్ని కాపాడే వాతావరణాన్ని కల్పిద్దాం! ..:: శరాది