7/జి, బందావన్ కాలనీ సినిమా తరహాలో...
7/జి, బందావన్ కాలనీ సినిమా తరహాలో...
Published Tue, Jan 7 2014 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 2:21 AM
చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, లవ్‌లీ చిత్రాల ద్వారా నిర్మాతగా కూడా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ పాత్రికేయుడు బి.ఎ.రాజు. ఈ ఏడాది ఆయన రెండు చిత్రాలను నిర్మించడానికి సంసిద్ధమయ్యారు. నేడు బి.ఎ.రాజు పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన భవిష్యత్ ప్రణాళికల గురించి విలేకరులతో ముచ్చటించారాయన. ‘‘సూపర్‌హిట్ ఫ్రెండ్స్ పతాకంపై మేం నిర్మించిన చిత్రాలన్నీ విజయాలను అందుకున్నాయి.
ఆర్.జె.సినిమాస్ పతాకంపై మేం నిర్మించిన ‘లవ్‌లీ’ చిత్రమైతే... పెద్ద సినిమాల మధ్య విడుదలై ఘన విజయాన్ని సాధించింది. నిర్మాతగా నాకెంతో సంతప్తి కలిగిస్తున్న విషయం అది. ఆర్.జె.పతాకంపై ఈ ఏడాది రెండు సినిమాలు నిర్మించనున్నాం. రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో ఒకటి ప్రేమిస్తే, 7/జి బందావన్ కాలనీ చిత్రాల్లా ఇంటెన్సిటీ ఉన్న కథ. అంతా కొత్తవారితో ఈ సినిమా తీయనున్నాం. మార్చిలో సెట్స్‌కి వెళ్తాం. మరో సినిమా యంగ్ హీరోతో ఉంటుంది. సెంటిమెంట్, కామెడీ ప్రధానంగా సాగే సినిమా ఇది. ఈ సినిమాలకు సంబంధించిన నటీనటులు,సాంకేతికనిపుణుల వివరాలు త్వరలో ప్రకటిస్తాం’’ అని తెలిపారు.
Advertisement
Advertisement