BA Raju Son Director Siva Kumar Marriage With His Friend Lavanya, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

BA Raju Son Marriage: మరాఠీ యువతితో బీఏ రాజు కుమారుడి వివాహం

Published Tue, Jan 25 2022 10:17 AM | Last Updated on Tue, Jan 25 2022 11:07 AM

BA Raju Son Siva Kumar Marriage With His Friend Lavanya, Pics Goes Viral - Sakshi

BA Raju Son Siva Kumar Marriage Pics Goes Viral: ప్రముఖ దివంగత నిర్మాత బీఏ రాజు తనయుడు, డైరెక్టర్‌ శివకుమార్‌ వివాహబంధంలోకి అడుగుపెట్టాడు. స్నేహితురాలు లావణ్యతో ఆయన ఈనె 22న ఆయన పెళ్లి జరిగింది. శివకుమార్‌కు చాలా ఇష్టమైన సంఖ్య 22. అందుకే ఆయన తొలి చిత్రానికి సైతం  శివకుమార్ ’22’ అనే పేరే పెట్టారు. ఇక 2022, జనవరి22వ తేదీ, 22 గంటలకు పెళ్లి చేసుకోవడం విశేషం.

కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఆయన వివాహం నిరాడంబరంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా శివకుమార్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. 'పూణెకి చెందిన మరాఠీ అమ్మాయి, నా స్నేహితురాలు దండిగే లావణ్యతో వివాహం జరిగింది. మేం ఇద్దరం కలిసి మా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. మీ అందరి ఆశీస్సులు కావాలి' అంటూ పేర్కొన్నారు.

ఇక కొత్త జంటకు పలువురు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు బెస్ట్‌ విషెస్‌ తెలియజేస్తున్నారు. కాగా పూరి జగన్నాథ్‌, వివి. వినాయక్‌ వంటి టాప్‌ డైరెక్టర్స్‌ వద్ద సహాయ దర్శకుడిగా చేసిన శివకుమార్‌.. శివకుమార్ ’22’అనే సినిమా ద్వారా దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement