బిగ్‌బాస్ ప్రియాంకతో సహజీవనం, పెళ్లి.. బాయ్‌ఫ్రెండ్ సమాధానమిదే | Bigg Boss Priyanka Jain Boyfriend Shiva Kumar Latest Interview | Sakshi
Sakshi News home page

Bigg Boss Priyanka: అందుకే కలిసుంటున్నాం.. క్లారిటీ ఇచ్చేసిన శివకుమార్

Published Sat, Feb 3 2024 4:54 PM | Last Updated on Sat, Feb 3 2024 5:08 PM

Bigg Boss Priyanka Jain Boyfriend Shiva Kumar Latest Interview - Sakshi

బిగ్‌బాస్ 7 ఫేమ్ ప్రియాంక సహజీవనం చేస్తోంది. ఈమె గురించి పరిచయమున్న వాళ్లకు ఈ విషయం తెలుసు. ఎందుకంటే ఈ షో జరుగుతున్న టైంలోనే ప్రియాంక బాయ్‌ఫ్రెండ్ హౌసులోకి వచ్చాడు. బయటకు రాగానే పెళ్లి చేసుకుందామని ఆమెతో చెప్పుకొచ్చాడు. ఇదంతా జరిగి దాదాపు మూడు నెలలు కావొస్తోంది. దీంతో చాలామంది ప్రియాంకని పెళ్లెప్పుడు? అని అడుగుతున్నారు. తాజాగా దీనిపై ఈమె ప్రియుడు స్పందించాడు. మ్యారేజ్ గురించి క్లారిటీ ఇచ్చేశాడు.

కర్ణాటకలో పుట్టి పెరిగిన ప్రియాంక.. తెలుగులో పలు సీరియల్స్‌లో హీరోయిన్‌గా చేసింది. 'జానకి కలగనలేదు' సీరియల్‌తో అనే సీరియల్‌తో కాస్త పాపులారిటీ తెచ్చుకుంది. ఈమెకు సీరియల్ నటుడు శివకుమార్‌తో ప్రేమలో ఉంది. ఇంకా చెప్పాలంటే వీళ్లిద్దరూ చాన్నాళ్ల నుంచి లివ్ ఇన్ రిలేషన్‌షిప్(సహజీవనం)లో ఉన్నారు. గతేడాది బిగ్‌బాస్ షో వల్ల తెలుగు ప్రేక్షకులకు ఈ విషయం తెలిసింది. అప్పటి నుంచి వీళ్లిద్దరూ పెళ్లెప్పుడు? పెళ్లెప్పుడు? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు వీటిపై ప్రియాంక బాయ్‌ఫ్రెండ్ పూర్తి స్పష్టత ఇచ్చేశాడు.

(ఇదీ చదవండి: పెళ్లి అయిపోయిందిగా సినిమాలు మానేస్తారా? క్లారిటీ ఇచ్చిన మెగా కోడలు)

'పెళ్లి ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందులోనూ ప్రియాంక గ్రాండ్‌గా కొన్నిరోజుల పాటు పెళ్లి చేసుకోవాలి అనుకుంటోంది. అంత గ్రాండ్‌గా చేసుకోవాలంటే డబ్బులు కావాలి. అందుకే ప్రస్తుతం లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. పెళ్లి అవ్వకుండా ఎలా జీవిస్తున్నారు? మీ పేరెంట్స్ ఏం అనట్లేదా? అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే మేం వాళ్ల అంగీకారంతోనే కలిసి ఉంటున్నాం. అయితే ఈ కామెంట్స్‌కి చెక్ పెట్టేందుకు ఒకానొక టైంలో రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకోవాలని ఆలోచన ఒకటి వచ్చింది. కానీ తర్వాత దాన్ని విరమించుకున్నాం' అని ప్రియాంక బాయ్‌ఫ్రెండ్ శివ చెప్పుకొచ్చాడు.

దీనిబట్టి చూసుకుంటే ప్రియాంక-శివకుమార్ ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం కష్టమే అనిపిస్తుంది. బాగా డబ్బులు సంపాదించాలి అంటున్నారంటే మరో రెండు మూడేళ్ల తర్వాత పెళ్లి ఉండొచ్చని ఈ జంట క్లారిటీ ఇస్తున్నట్లే.

(ఇదీ చదవండి: 12 ఏళ్ల క్రితం వివాదం.. ఇప్పుడు సారీ చెప్పిన యంగ్ హీరోయిన్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement