మరో కొత్త ప్రయత్నం | Another new attempt | Sakshi
Sakshi News home page

మరో కొత్త ప్రయత్నం

Published Tue, Jan 6 2015 11:46 PM | Last Updated on Sat, Sep 2 2017 7:19 PM

మరో కొత్త ప్రయత్నం

మరో కొత్త ప్రయత్నం


 ప్రేమలో పావనీ కల్యాణ్, చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మ గారి మనవడు, లవ్‌లీ వంటి చిత్రాలు నిర్మించిన నిర్మాత బి.ఎ. రాజు మరో సినిమా నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. బి. జయ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. నేడు బి.ఎ. రాజు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘మంచి స్క్రిప్టు సిద్ధం చేశాం. వాణిజ్య అంశాలతో పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఉంటుంది. అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను రూపొందిస్తాం. ఫిబ్రవరిలో మొదలుపెడతాం. తారాగణం, సాంకేతికవర్గ వివరాలు త్వరలోనే తెలియజేస్తాం’’ అని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement