
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తన తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా మోహన్ బాబు ఫోటోను షేర్ చేస్తూ పుట్టినరోజు విషెస్ చెప్పారు. తన తండ్రితో సినిమాల్లో నటించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వీడియోను కూడా పంచుకున్నారు. ఈ వీడియోను 'నా సూర్యుడివి.. చంద్రుడివి.. నా దేవుడివి నువ్వే' అంటూ యానిమల్ సాంగ్‌తో తండ్రి తన ప్రేమను చాటుకున్నారు.
మంచు మనోజ్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'హ్యాపీ బర్త్ డే నాన్న.. ఈ రోజు నీ పక్కన ఉండి సెలబ్రేట్ చేసుకునే అవకాశాన్ని మిస్సవుతున్నా.. నీ వెంట నడిచేందుకు ఎంతో ఆసక్తిగా వేచి ఉన్నా. నీతో ఉన్న ప్రతి క్షణాలను ప్రేమిస్తా నాన్న' అంటూ తన ప్రేమను వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ చూసిన మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి లైక్ కొట్టింది. ఇది చూసిన అభిమానులు తండ్రిపై తన ప్రేమను మరోసారి చాటుకున్నారని ప్రశంసిస్తున్నారు. మీరిద్దరు త్వరలోనే కలిసిపోవాలని కోరుకుంటున్నట్లు మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
మంచు ఫ్యామిలీలో గొడవలు..
గత కొద్ది నెలలుగా మంచు వారి ఫ్యామిలీలో గొడవలు జరుతుగున్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు జల్‌పల్లిలోని నివాసం వద్ద మొదలైన ఈ వివాదం.. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్దకు కూడా చేరింది. మంచు విష్ణు- మనోజ్‌కు మధ్య మొదలైన గొడవే ఈ వివాదానికి కారణమని తెలుస్తోంది. ఈ గొడవల నేపథ్యంలో ఒకరిపై ఒకరు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం వీరంతా తమ పనులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మోహన్ బాబు కన్నప్ప మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాను మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కించారు.
Comments
Please login to add a commentAdd a comment