శివుడి ఆశీస్సులతో ఆరంభం.. శివరాత్రికి పూర్తి | Vaisakham has Lord Shiva's blessings: Producer BA Raju | Sakshi
Sakshi News home page

శివుడి ఆశీస్సులతో ఆరంభం.. శివరాత్రికి పూర్తి

Published Mon, Feb 27 2017 12:50 AM | Last Updated on Tue, Sep 5 2017 4:41 AM

శివుడి ఆశీస్సులతో ఆరంభం.. శివరాత్రికి పూర్తి

శివుడి ఆశీస్సులతో ఆరంభం.. శివరాత్రికి పూర్తి

‘‘కీసరగుట్ట శివాలయంలో శివుడి ఆశీస్సులతో మా ‘వైశాఖం’ చిత్రీకరణ ప్రారంభమైంది. సరిగ్గా  శివరాత్రికి చిత్రీకరణ పూర్తయింది’’ అని నిర్మాత బీఏ రాజు అన్నారు. హరీష్, అవంతిక జంటగా బి. జయ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘వైశాఖం’ పోస్ట్‌ ప్రొడక్షన్ జరుపుకుంటోంది.

రాజు మాట్లాడుతూ– ‘‘వైశాఖం’ ఓవర్సీస్‌ రైట్స్‌ను బ్లూ స్కై సంస్థ ఫ్యాన్సీ ఆఫర్‌కు సొంతం చేసుకుంది. నైజాం, ఆంధ్ర, సీడెడ్‌ ఏరియాల నుంచి బయ్యర్స్‌ చాలామంది వస్తున్నారు. స్పీడ్‌గా బిజినెస్‌ అవుతోంది’’ అన్నారు. ‘‘కథ ప్రకారం ఓ సన్నివేశంలో చండీయాగాన్ని శాస్త్రోక్తం గా జరిపించాం. అలా శివుడి అనుగ్రహం ఉన్న మా సినిమా శివరాత్రికి పూర్తవడం విశేషం. మంచి ఫీల్‌గుడ్‌ మూవీ ఇది’’ అని బి. జయ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వాలిశెట్టి వెంకటసుబ్బారావు, సంగీతం: డి.జె. వసంత్, లైన్  ప్రొడ్యూసర్‌: బి.శివకుమార్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement