అరుంధతితో పోల్చడం ఆనందం! | avantika movie shooting start | Sakshi
Sakshi News home page

అరుంధతితో పోల్చడం ఆనందం!

Sep 21 2016 11:50 PM | Updated on Sep 4 2017 2:24 PM

అరుంధతితో పోల్చడం ఆనందం!

అరుంధతితో పోల్చడం ఆనందం!

దేవుడికి జంతు బలినిస్తే మంచి జరుగుతుందనే ఆచారం నేపథ్యంలో రూపొందుతున్న హారర్ సినిమా ‘అవంతిక’.

దేవుడికి జంతు బలినిస్తే మంచి జరుగుతుందనే ఆచారం నేపథ్యంలో రూపొందుతున్న హారర్ సినిమా ‘అవంతిక’. శ్రీరాజ్ బళ్ళా దర్శకత్వంలో పూర్ణ, గీతాంజలి ముఖ్యతారలుగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి సన్నివేశానికి నిర్మాత సి.కల్యాణ్ కెమేరా స్విచాన్ చేయగా, దర్శకరత్న దాసరి నారాయణరావు క్లాప్ ఇచ్చారు.
 
  దర్శకులు రేలంగి నరసింహారావు గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ప్రస్తుత సమాజంలో బర్నింగ్ ఇష్యూని సినిమాలో ప్రస్తావిస్తున్నాం’’ అని శ్రీరాజ్ బళ్ళా అన్నారు. ‘‘34 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేశాం’’ అని నిర్మాత తెలిపారు. ‘‘అనుష్క ‘అరుంధతి’తో ఈ సినిమాని పోల్చడం నా అదృష్టం’’ అన్నారు పూర్ణ. చిత్ర సమర్పకులు కేఆర్ ఫణిరాజ్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement