తాతగారే నాకు స్ఫూర్తి! | Music Director DJ Vasanth Vaisakham | Sakshi
Sakshi News home page

తాతగారే నాకు స్ఫూర్తి!

Published Wed, Aug 31 2016 11:50 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM

తాతగారే నాకు స్ఫూర్తి!

తాతగారే నాకు స్ఫూర్తి!

ప్రముఖ సంగీత దర్శకుడు సత్యం మనవడిగా ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని.. తనదైన శైలిలో సంగీతం  అందిస్తూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు డీజే వసంత్. ‘మడత కాజా’, ‘సుడిగాడు’, ‘స్పీడున్నోడు’ తదితర చిత్రాలకు పాటలు స్వరపరిచారు. తాజాగా ‘వైశాఖం’ చిత్రానికి సంగీతదర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. వసంత్ మాట్లాడుతూ- ‘‘తాతగారి ఇన్‌స్పిరేషన్‌తోనే ఇండస్ట్రీకి వచ్చా.
 
 నా పదహారేళ్ల ఇండస్ట్రీ లైఫ్‌లో శ్రీ, మణిశర్మ, హ్యారిస్ జయరాజ్, ఆర్‌పీ పట్నాయక్ తదితరుల దగ్గర పనిచేశా. కెరీర్ ప్రారంభంలో కొన్ని చిత్రాలకు పాటలు కూడా రాశా. ‘నా గత చిత్రాల కంటే ‘వైశాఖం’ మూవీకి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చావు. నేను ఫుల్ హ్యాపీ’ అని డెరైక్టర్ బి. జయ అన్నారు. ఆ ఒక్క మాట చాలు నాకు. ప్రస్తుతం ‘అల్లరి’ నరేశ్, మంచు మనోజ్ చిత్రాలతో పాటు మరో నాలుగు చిత్రాలకు సంగీతం అందిస్తున్నా’’ అన్నారు. బి.జయ దర్శకత్వంలో బీఏ రాజు నిర్మించిన ‘వైశాఖం’ త్వరలో విడుదల కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement