మలయాళ రాక్‌స్టార్‌ పెళ్లి.. హాజరైన సెలబ్రిటీలు | Malayalam Music Director Sushin Ties Knot With Uthara Krishnan | Sakshi
Sakshi News home page

మంజుమ్మల్‌ బాయ్స్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ పెళ్లి.. సెలబ్రిటీల హాజరు

Published Wed, Oct 30 2024 4:49 PM | Last Updated on Wed, Oct 30 2024 5:00 PM

Malayalam Music Director Sushin Ties Knot With Uthara Krishnan

మలయాళ మ్యూజిక్‌ డైరెక్టర్‌ సుశిన్‌ శ్యామ్‌ పెళ్లి పీటలెక్కాడు. ప్రేయసి, సింగర్‌ ఉత్తర కృష్ణన్‌ మెడలో మూడుముళ్లు వేశాడు. ఇరు కుటుంబాలు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇకపోతే నటుడు పార్వతీ జయరామ్‌ చుట్టాలమ్మాయే ఉత్తర. 

బెస్ట్‌ ఫ్రెండ్స్‌ నుంచి ప్రేమికులుగా..
పార్వతి జయరాం కూతురి పెళ్లిలోనే సుశిన్‌-ఉత్తర ప్రేమాయణం బయటపడింది. మొదట బెస్ట్‌ ఫ్రెండ్స్‌గా ఉన్న వీళ్లు తర్వాత ప్రేమికులుగా మారారు. ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి భార్యాభర్తలుగా ఓ అడుగు ముందుకు వేశారు. ఈ వివాహానికి సినీనటులు ఫహద్‌ ఫాజిల్‌, నజ్రియా, జయరామ్‌, దర్శకుడు అన్వర్‌ రషీద్‌ తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. 

మ్యూజిక్‌ కెరీర్‌..
సుశిన్‌ విషయానికి వస్తే.. దీపక్‌ దేవ్‌ అనే మ్యూజిక్‌ డైరెక్టర్‌ దగ్గర మొదట శిక్షణ తీసుకున్నాడు. లార్డ్‌ లివింగ్‌స్టన్‌ 700 కండి, కిస్మత్‌ వంటి చిత్రాలకు బీజీఎమ్‌ అందించాడు. వరథాన్‌, కుంబలంగి నైట్స్‌ సినిమాలతో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. భీష్మ పర్వం, మిన్నాల్‌ మురళి, రోమాంచం, మంజుమ్మల్‌ బాయ్స్‌, ఆవేశం, బోగిన్‌ విల్లా వంటి పలు చిత్రాలకు సంగీతం అందించాడు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement