అతనితో హీరోయిన్ డేటింగ్.. మొత్తానికి తెలిసిపోయింది! | Ananya Panday Rumoured Boy Friend Walker Blanco Confirms Relationship, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Ananya Panday Relationship: అతనితో లైగర్ భామ డేటింగ్.. ఆ పోస్ట్‌తో ఫుల్ క్లారిటీ!

Published Wed, Oct 30 2024 3:32 PM | Last Updated on Wed, Oct 30 2024 4:09 PM

Ananya Panday rumoured boy friend Walker Blanco confirms relationship

బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తెలుగువారికి సుపరిచితమే. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్‌ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ సినిమాకు పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది.

అయితే ప్రస్తుతం బాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉంది అనన్య పాండే. ఇవాళ తన 26 పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ విషయం తెలుసుకున్న సినీతారలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇటీవల సీటీఆర్ఎల్‌ మూవీతో అలరించిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం కాల్‌ మీ బే సీజన్‌-2లో నటిస్తోంది.

అంబానీ పెళ్లిలో సందడి..

ఇదిలా ఉండగా.. గతంలో అంబానీ పెళ్లిలో అనన్య పాండే సందడి చేసింది. ఆ సమయంలో మోడల్ వాకర్ బ్లాంకోతో కలిసి హాజరైంది. దీంతో వీరిద్దరిపై అప్పుడే డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. ఈ జంట పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్‌ పోస్టులు పెట్టారు. అయితే డేటింగ్‌పై అనన్య ఇప్పటివరకు స్పందించలేదు.

ఐ లవ్ యూ అంటూ పోస్ట్

అయితే ఇవాళ అనన్య పాండే బర్త్‌ డే కావడంతో వాకర్ బ్లాంకో విషెస్ తెలిపారు. ఇన్‌స్టా స్టోరీస్‌లో అనన్య ఫోటోను పోస్ట్ చేస్తూ క్యాప్షన్‌ రాసుకొచ్చారు. 'హ్యాపీ బర్త్‌ డే బ్యూటీ.. యూ ఆర్ సో స్పెషల్.. ఐ లవ్ యూ అనీ' అంటూ రొమాంటిక్‌గా విష్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ వీరిద్దరు డేటింగ్‌ రూమర్స్ నిజమేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ తాజా పోస్ట్‌తో ఈ జంట ప్రేమలో ఉన్నారని క్లారిటీ వచ్చేసింది.

తొలిసారిగా ఆ పెళ్లిలోనే

కాగా.. అనన్య, వాకర్‌లు మొదటిసారిగా  జూలైలో జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల వివాహంలో జంటగా కనిపించారు. ఈ పెళ్లిలో వాకర్‌ని తన భాగస్వామిగా పరిచయం చేసింది. ఈ వేడుకల్లో ఓ సాంగ్‌కు ఇద్దరు కలిసి డ్యాన్స్ చేశారు. అంతకుముందు బాలీవుడ్ నటుడు ఆదిత్య రాయ్ కపూర్‌తో డేటింగ్ చేసింది. ఈ ఏడాది మార్చిలో ఈ జంట ఇద్దరూ విడిపోయారు. అయితే తమ రిలేషన్ షిప్ గురించి ఎక్కడా కూడా స్పందించలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement