
మలయాళ నటి, సింగర్ అమృత సురేశ్.. నటుడు బాలాను 2010లో పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు కూడా పుట్టింది. కుటుంబంలో గొడవలు మొదలవడంతో 2019లో అమృత-బాలా విడిపోయారు. విడాకుల తర్వాత కూడా తనతో పాటు, కూతుర్ని వేధించాడని అమృత ఫిర్యాదు చేయగా పోలీసులు బాలను అరెస్ట్ చేశారు.

అదృష్టం కూడా ఉండాలి
తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చిన అతడు ఇటీవలే మూడో పెళ్లి చేసుకున్నాడు. అమృత మాత్రం ఒంటరిగానే ఉంటోంది. ఇదంతా చూశాక తనకు పెళ్లంటేనే భయమేస్తోందంటోంది అమృత సోదరి, నటి అభిరామి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'విడాకులే లేని పెళ్లి కావాలి. అది జరుగుతుందో లేదో నాకు తెలియదు కానీ.. అందుకు అదృష్టం కూడా కలిసిరావాలి.
పెళ్లి అంటేనే భయం
పెళ్లికి నేను విరుద్ధం కాదు. కానీ మా అక్క పడ్డ కష్టాలు చూశాక వివాహమంటేనే భయమేస్తోంది. ఆ భయం వల్లే ఇంకా పెళ్లి చేసుకోలేదు. అలా అని ఎప్పటికీ సింగిల్‌గానే ఉండిపోను. ఏదో ఒకరోజు కచ్చితంగా మూడు ముళ్లు వేయించుకుంటాను. అయితే గుడ్డిగా తప్పుడు వ్యక్తితో ప్రేమలో పడటం కంటే ప్రమాదకరం మరొకటి లేదు. మా అక్క పెళ్లయినప్పటినుంచి అంటే దాదాపు 14 ఏళ్లుగా మా కుటుంబం బాధ అనుభవిస్తూనే ఉంది' అని అభిరామి చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment