నెలన్నర నుంచి నిద్ర లేదు, ఏడుపొక్కటే మిగిలింది: గాయని | Singer Anju Joseph Reveals About Her Past Relationship In An Recent Interview, Deets Inside | Sakshi

విడాకులు తీసుకున్నవాళ్లందరూ చెడ్డవాళ్లు కాదు: సింగర్‌

Aug 21 2024 7:41 PM | Updated on Aug 21 2024 7:57 PM

Singer Anju Joseph About Her Past Relationship

ఒక్క ఛాన్స్‌.. ఒకే ఒక్క ఛాన్స్‌తో తన సత్తా ఏంటో చూపించింది అంజూ జోసెఫ్‌. 2010లో ఐడియా స్టార్‌ సింగర్‌ (మలయాళం) నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. తన గాత్రంతో అందరినీ మెప్పించింది. సినిమాలో బ్యాక్‌గ్రౌండ్‌ సింగర్‌గా పాడటం మొదలుపెట్టింది. అతి కొద్ది సమయంలోనే కవర్‌ సాంగ్స్‌, స్టేజీ షోలు చేసే స్థాయికి ఎదిగింది.

ఓసీపీడీ
బాహుబలి మూవీలోని ధీవర పాటపై ఈమె చేసిన కవర్‌ సాంగ్‌ అప్పట్లో ఎంతో వైరలయింది. ఇకపోతే ఆమె షో డైరెక్టర్‌ అనూప్‌ జాన్‌ను పెళ్లాడింది. ఐదేళ్లపాటు అన్యోన్యంగానే ఉన్న ఈ జంట తర్వాత కలిసుండలేకపోయారు, విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో తను పడ్డ మానసిక వేదనను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. అంజు మాట్లాడుతూ.. నాకు అబ్సెసివ్‌ కంపల్సిన్‌ పర్సనాలిటీ డిజార్డర్‌ (OCPD.. అంటే ఏ పనైనా పరిపూర్ణంగా చేయాలనుకుంటారు), అలాగే ఆందోళన సమస్యలు ఉన్నాయి. వీటికి మందులు కూడా తీసుకుంటున్నాను.

అర్థం కావట్లే
గత రిలేషన్‌షిప్‌ వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాను. దాని ఫలితంగా మందులు వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెలన్నర నుంచి సరిగా నిద్రపోయిందే లేదు. ఎప్పుడూ మెలకువతోనే ఉంటున్నాను. ఏం ఆలోచించాలో కూడా అర్థమవడం లేదు. నిద్రరాకపోయినా బెడ్‌పై నుంచి లేవబుద్ధి కావట్లేదు. నేను ఎలా ఉన్నా తెచ్చిపెట్టుకున్న నవ్వుతో షోలు చేశాను. అది నా వృత్తి, పైగా నేను ఏదైనా పర్ఫెక్ట్‌గా చేయాలనుకుంటాను కాబట్టి ఫేక్‌ నవ్వుతో కవర్‌ చేసేశాను. 

నన్ను నేను తెలుసుకుంటున్నా
కానీ నా శరీరంలోనూ సమస్యలు వస్తున్నాయి. నేను ఏడ్చిన తర్వాతే షోకి వస్తున్నానని అక్కడున్నవారికీ తెలిసిపోతుంది. నా భర్తతో బంధం తెగిపోవడానికి ఓసీడీ ఒక్కటే కారణం కాదు. ఇంకా ఇతరత్రా కారణాలున్నాయి. అయితే బంధం ముక్కలైందని నేనేమీ చింతించట్లేదు. దాని నుంచి ఎంతో నేర్చుకుంటున్నాను. అసలు నేనేంటో లోతుగా తెలుసుకుంటున్నాను. 

ఎప్పుడూ ఏడుపే..
ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటున్నాను. అదొక్కటే నాకు మిగిలింది. దీనికి కూడా థెరపీ చేయించుకుంటున్నాను. జీవితం ముందుకు కదలట్లేదు. అలాగని బలవంతంగా చనిపోనూలేను. అయినా విడాకులు తీసుకోవడం పెద్ద నేరమేమీ కాదు. విడాకులు తీసుకున్నవాళ్లందరూ చెడ్డవాళ్లు కాదు అని గాయని చెప్పుకొచ్చింది.

చదవండి: రావణుడిపై ప్రేమతో పచ్చబొట్టు వేయించుకున్న బుల్లితెర నటుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement