బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్డునెంబర్–14లోని శబ్దాలయ వెనుక సంగీత దర్శకుడు దివంగత చక్రవర్తికి కేటాయించిన స్థలంలో నిరి్మంచిన అక్రమ నిర్మాణాలను షేక్‌పేట మండల రెవెన్యూ సిబ్బంది బుధవారం కూల్చివేశారు. చక్రవర్తికి మ్యూజిక్ రికార్డింగ్ స్టూడియో నిరి్మంచుకునేందుకు ప్రభుత్వం 25 ఏళ్ల క్రితం బంజారాహిల్స్ రోడ్డునెంబర్–14లో 20 గుంటల స్థలాన్ని కేటాయించింది. అయితే కేటాయించిన స్థలంలో ఏడాది లోపు ఆ ఉద్దేశాన్ని బహిర్గతపరుస్తూ నిర్మాణాలు చేపట్టాలని నిబంధనలు చెబుతున్నాయి. సంగీత దర్శకుడు చక్రవర్తి మాత్రం తనకు కేటాయించిన స్థలంలో పదేళ్లు దాటినా ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు.
ఆ తర్వాత ఆయన మృతి చెందారు. ఆయన తనయుడు కూడా సదరు స్థలంలో రికార్డింగ్ స్టూడియో నిర్మించకపోగా తాను కూడా తప్పుకున్నారు. దీంతో ప్రభుత్వం ఈ స్థలాన్ని స్వా«దీనం చేసుకుని ల్యాండ్ బ్యాంక్‌లో నమోదు చేసింది. గత కొన్నేళ్లుగా ఈ స్థలం ప్రభుత్వ ఆ«దీనంలోనే ఉంది. ఖాళీగా ఉన్న ఈ స్థలంలో కొందరు అక్రమ నిర్మాణాలను చేపట్టారు. ఒక్కొక్కరి నుంచి రూ.10 నుంచి 25 వేలు వసూలు చేస్తూ డబ్బాలు ఏర్పాటు చేశారని, కొన్ని శాశ్వత నిర్మాణాలు చేపట్టినట్లు తమ దృష్టికి రావడంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు షేక్‌పేట మండల తహశీల్దార్ అనితారెడ్డి తెలిపారు.
ఈ స్థలం ప్రభుత్వానిదేనని, ఎవరైనా నిర్మాణాలు చేపట్టినా, ఆక్రమించినా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ స్థలాన్ని ప్రభుత్వ విభాగాలకు కేటాయించే ప్రతిపాదన ఉందన్నారు. ఈ స్థలం ఖాళీగా ఉండడంతో కొందరు నకిలీ డాక్యుమెంట్లతో తమదేనంటూ అక్రమ నిర్మాణాలు చేపట్టి అద్దెలు తీసుకుంటున్నట్లుగా తమ దృష్టికి వచి్చందన్నారు. ఇలాంటి వాటిని ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. స్థలంలో ప్రభుత్వ హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment