వేసవిలో వైశాఖం | Vaisakham movie planned to release in april | Sakshi
Sakshi News home page

వేసవిలో వైశాఖం

Published Mon, Feb 13 2017 11:44 PM | Last Updated on Tue, Sep 5 2017 3:37 AM

వేసవిలో వైశాఖం

వేసవిలో వైశాఖం

వైశాఖంలోనే శ్రీ వేంకటేశ్వర స్వామి–పద్మావతిల కల్యాణం జరిగింది. అందుకే, ఈ మాసంలో ఎక్కువ పెళ్లిళ్లు జరుగుతుంటాయి. ఎంతో ప్రాముఖ్యత, పవిత్రత గల ఈ ‘వైశాఖం’ పేరుతో బి. జయ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. హరీశ్, అవంతిక జంటగా ఆర్‌.జె. సినిమాస్‌ పతాకంపై బీఏ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్‌లో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

దర్శకురాలు బి. జయ మాట్లాడుతూ – ‘‘ప్రేమలో కొత్త కోణాన్ని ఆవిష్కరించే చిత్రమిది. ఓ అబ్బాయి లైఫ్‌లో ‘వైశాఖం’లా ప్రవేశించిన ఓ అమ్మాయి, అతడి లైఫ్‌లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? వీరి ప్రేమ పెళ్లి వరకూ ఎలా వెళ్లిందనేది సినిమా’’ అన్నారు. ‘‘మా సంస్థ తీసిన ప్రేమకథా చిత్రాలన్నీ హిట్టయ్యాయి. కుటుంబ నేపథ్యంలో తీసిన ఈ ప్రేమకథా చిత్రం కూడా హిట్టవుతుంది’’ అన్నారు బీఏ రాజు. ఈ చిత్రానికి లైన్‌ ప్రొడ్యూసర్‌: బి. శివకుమార్, సంగీతం: డీజే వసంత్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement