వైశాఖం...హార్ట్ టచింగ్ | B Jaya set to direct Vaishakam | Sakshi
Sakshi News home page

వైశాఖం...హార్ట్ టచింగ్

Published Mon, Oct 10 2016 10:57 PM | Last Updated on Mon, Sep 4 2017 4:54 PM

వైశాఖం...హార్ట్ టచింగ్

వైశాఖం...హార్ట్ టచింగ్

‘‘నాకు కుటుంబమంటే ఇష్టం. స్నేహితులంటే చాలా ఇష్టం. అనుబంధాలకు చాలా విలువ ఇచ్చే వ్యక్తిని. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని జయగారు ఓ అద్భుతమైన కథ రాశారు. అందులో షార్ట్ అండ్ స్వీట్ రోల్‌లో నటించమనగానే అంగీకరించా. గుర్తుండే పాత్ర అవుతుంది’’ అని నటుడు సాయికుమార్ అన్నారు. హరీశ్, అవంతిక జంటగా బి.జయ దర్శకత్వంలో బీఏ రాజు నిర్మిస్తున్న సినిమా ‘వైశాఖం’. బి.జయ మాట్లాడుతూ - ‘‘ప్రతి సన్నివేశాన్ని పండగ వాతావరణంలో చిత్రీకరించాం.

బాడీ గింబల్ టెక్నాలజీతో షూట్ చేశాం. ఇప్పుడు ‘2.0’కి శంకర్ ఈ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు’’ అన్నారు. బీఏ రాజు మాట్లాడుతూ -‘‘జయ మనస్తత్వానికి దగ్గరగా ఉంటుందీ చిత్రం. తనకు గొప్ప పేరు తీసుకొస్తుంది. లవ్, కామెడీ, ఎమోషన్, చిన్న మెసేజ్ ఉన్న హార్ట్ టచింగ్ మూవీ. కన్నడలో 9, తెలుగులో 6 సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సాయికుమార్‌గారు మాపై అభిమానంతో సినిమా చేసినందుకు థ్యాంక్స్’’ అన్నారు. హీరో హరీశ్, సంగీత దర్శకుడు డీజే వసంత్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement