B.Jaya
-
బుజ్జి బాహుబలి హీరో అయ్యాడు
‘లవ్లీ, ఉయ్యాలా జంపాలా, కృష్ణగాడి వీర ప్రేమగాథ, బాహుబలి’ వంటి చిత్రాల్లో బాల నటుడిగా నటించిన నిఖిల్ హీరోగా పరిచయమవుతు న్నాడు. ‘వాళ్లమ్మాయి’ పేరుతో కృష్ణచైతన్య దర్శకత్వంలో భక్తి క్రియేషన్స్పై ప్రవీణ్ సిద్ధాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నిర్మాత రాజ్ కందుకూరి కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకురాలు జయ.బి క్లాప్ ఇచ్చారు. నృత్యదర్శకుడు శేఖర్ గౌరవ దర్శకత్వం వహించారు. కృష్ణచైతన్య మాట్లాడుతూ– ‘‘2001లో ఒక ఊరిలో జరిగిన వాస్తవ సంఘటనలతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాం. ఈ సమాజంలో రావణాసురుల మధ్య నలిగిపోతున్న ఒక సీత కథే ఇది. ఆ అమ్మాయిని ఓ కుర్రాడు ఎలా కాపాడాడు? అన్నదే కథాంశం’’ అన్నారు. ‘‘ఈ నెల 25న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి ఒకే షెడ్యూల్లో పూర్తి చేస్తాం’’ అన్నారు ప్రవీణ్ సిద్ధాంత్. మాటల రచయిత కమల్ వి.వి., సంగీత దర్శకురాలు కౌసల్య, నిర్మాత బీఏ రాజు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మురళీ మోహన్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వినయ్, శివగౌడ్. -
`వైశాఖం `మూవీ స్టిల్స్
-
వైశాఖం...హార్ట్ టచింగ్
‘‘నాకు కుటుంబమంటే ఇష్టం. స్నేహితులంటే చాలా ఇష్టం. అనుబంధాలకు చాలా విలువ ఇచ్చే వ్యక్తిని. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని జయగారు ఓ అద్భుతమైన కథ రాశారు. అందులో షార్ట్ అండ్ స్వీట్ రోల్లో నటించమనగానే అంగీకరించా. గుర్తుండే పాత్ర అవుతుంది’’ అని నటుడు సాయికుమార్ అన్నారు. హరీశ్, అవంతిక జంటగా బి.జయ దర్శకత్వంలో బీఏ రాజు నిర్మిస్తున్న సినిమా ‘వైశాఖం’. బి.జయ మాట్లాడుతూ - ‘‘ప్రతి సన్నివేశాన్ని పండగ వాతావరణంలో చిత్రీకరించాం. బాడీ గింబల్ టెక్నాలజీతో షూట్ చేశాం. ఇప్పుడు ‘2.0’కి శంకర్ ఈ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు’’ అన్నారు. బీఏ రాజు మాట్లాడుతూ -‘‘జయ మనస్తత్వానికి దగ్గరగా ఉంటుందీ చిత్రం. తనకు గొప్ప పేరు తీసుకొస్తుంది. లవ్, కామెడీ, ఎమోషన్, చిన్న మెసేజ్ ఉన్న హార్ట్ టచింగ్ మూవీ. కన్నడలో 9, తెలుగులో 6 సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సాయికుమార్గారు మాపై అభిమానంతో సినిమా చేసినందుకు థ్యాంక్స్’’ అన్నారు. హీరో హరీశ్, సంగీత దర్శకుడు డీజే వసంత్ పాల్గొన్నారు. -
విజయనిర్మలగారు చేసిన చిత్రాల సంఖ్యలో సగమైనా...
‘‘ఓ విజయవంతమైన చిత్రం చేసిన తర్వాత తదుపరి చిత్రంపై అంచనాలు పెరగడం సహజం. అందుకే ‘లవ్లీ’ తర్వాత హడావిడిగా సినిమా మొదలుపెట్టకుండా కథా పరంగా జాగ్రత్త తీసుకుంటున్నాను’’ అని దర్శకురాలు బి. జయ అన్నారు. ఆదివారం ఆమె పుట్టినరోజు వేడుక జరిగింది. ఈ వేడుకలో సూపర్ హిట్ పత్రికాధినేత, నిర్మాత బీఏ రాజు, సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావు పాల్గొన్నారు. బి. జయ మాట్లాడుతూ - ‘‘ఈ ఏడాది ‘తొక్కుడుబిళ్ల’, ‘కలిసుందాం.. కండీషన్స్ అప్లయ్’ పేరుతో రెండు చిత్రాలు, నూతన హీరో సజ్జన్తో ఓ చిత్రం చేయబోతున్నాం. వీటిలో ఒకటి మలయాళ చిత్రాల తరహాలో సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. ‘తొక్కుడుబిళ్ల’కు పరుచూరి గోపాలకృష్ణ కథ, మాటలు అందిస్తున్నారు. సంగీతదర్శకుడు వసంత్ ఆధ్వర్యంలో వచ్చే నెల పాటలను రికార్డ్ చేస్తాం’’ అని చెప్పారు. మీ దర్శకత్వంలో సినిమా చేయడానికి నాగార్జున సుముఖత వ్యక్తపరిచారు కదా? అనే ప్రశ్నకు - ‘‘నాగార్జునగారు విభిన్న తరహా చిత్రాలు చేశారు. ఆయనతో చేయాలంటే సరికొత్త కథ కావాలి. లేడీ డెరైక్టర్తో చేసే సినిమా నాకు కొత్తగా ఉండాలని ఆయన కూడా ఉన్నారు. కథ కుదరాలి’’ అన్నారు. దర్శకురాలిగా విజయనిర్మల తనకు ఆదర్శం అని చెబుతూ - ‘‘దాదాపు 50 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఘనత ఆమెది. పైగా అన్నీ విభిన్న కథాంశం గల చిత్రాలే. విజయనిర్మలగారు చేసిన చిత్రాల సంఖ్యలో సగమైనా చేరాలనుకుంటున్నాను’’ అన్నారు.