బుజ్జి బాహుబలి హీరో అయ్యాడు | bahubali child artist became a hero | Sakshi
Sakshi News home page

బుజ్జి బాహుబలి హీరో అయ్యాడు

Published Sat, Dec 9 2017 12:40 AM | Last Updated on Sat, Dec 9 2017 12:40 AM

bahubali child artist became a hero - Sakshi

‘లవ్లీ, ఉయ్యాలా జంపాలా, కృష్ణగాడి వీర ప్రేమగాథ, బాహుబలి’ వంటి చిత్రాల్లో బాల నటుడిగా నటించిన నిఖిల్‌ హీరోగా పరిచయమవుతు న్నాడు. ‘వాళ్లమ్మాయి’ పేరుతో కృష్ణచైతన్య దర్శకత్వంలో భక్తి క్రియేషన్స్‌పై ప్రవీణ్‌ సిద్ధాంత్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నిర్మాత రాజ్‌ కందుకూరి కెమెరా స్విచ్చాన్‌ చేయగా, దర్శకురాలు జయ.బి క్లాప్‌ ఇచ్చారు. నృత్యదర్శకుడు శేఖర్‌ గౌరవ దర్శకత్వం వహించారు.

కృష్ణచైతన్య మాట్లాడుతూ– ‘‘2001లో ఒక ఊరిలో జరిగిన వాస్తవ సంఘటనలతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాం. ఈ సమాజంలో రావణాసురుల మధ్య నలిగిపోతున్న ఒక సీత కథే ఇది. ఆ అమ్మాయిని ఓ కుర్రాడు ఎలా కాపాడాడు? అన్నదే కథాంశం’’ అన్నారు. ‘‘ఈ నెల 25న రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేస్తాం’’ అన్నారు ప్రవీణ్‌ సిద్ధాంత్‌. మాటల రచయిత కమల్‌ వి.వి., సంగీత దర్శకురాలు కౌసల్య, నిర్మాత బీఏ రాజు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మురళీ మోహన్‌ రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: వినయ్, శివగౌడ్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement