హిట్‌ గ్యారెంటీ | Puri Jagannadh About Vaisakham Movie | Sakshi
Sakshi News home page

హిట్‌ గ్యారెంటీ

Published Wed, May 17 2017 11:41 PM | Last Updated on Tue, Sep 5 2017 11:22 AM

హిట్‌ గ్యారెంటీ

హిట్‌ గ్యారెంటీ

– పూరి జగన్నాథ్‌
‘‘రాజుగారు, జయగారు మా కుటుంబ సభ్యుల్లాంటివారు. జయగారు ఏ సినిమా తీసినా ఆ సినిమాలోని పాటలు, ట్రైలర్‌ నాకు చూపిస్తుంటారు. ‘వైశాఖం’ పాటలు చాలా బాగున్నాయి. వసంత్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చారు’’ అని దర్శకుడు పూరి జగన్నాథ్‌ అన్నారు. హరీశ్, అవంతిక జంటగా జయ బి. దర్శకత్వంలో బీఏ రాజు నిర్మించిన ‘వైశాఖం’ జూన్‌ ఫస్ట్‌ వీక్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘వైశాఖం’ పాటల్ని పూరి ప్రత్యేకంగా వీక్షించి, మాట్లాడారు.

‘‘హరీశ్, అవంతిక ఫుల్‌ ఎనర్జిటిక్‌గా పోటీపడి నటించారు. ఇద్దరికీ మంచి ఫ్యూచర్‌ ఉంటుంది. లొకేషన్స్‌ చాలా కొత్తగా, రిచ్‌గా ఉన్నాయి. విజువల్స్‌ బ్యూటిఫుల్‌. ‘వైశాఖం’ తప్పకుండా పెద్ద హిట్‌ అవుతుంది’’ అన్నారు. ‘‘లవ్‌లీ’ పాటలు చూసి పూరి జగన్నాథ్‌గారు మమ్మల్ని అభినందించారు.  ఆ సినిమా చాలా పెద్ద హిట్‌ అయ్యింది. ఆ చిత్రం మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనూప్‌కి తన తర్వాతి చిత్రంలో అవకాశమిచ్చారు. పూరీని ఇన్‌స్పైర్‌ చేసేలా ‘వైశాఖం’ పాటలు ఉండటం నిజంగా హ్యాపీ’’ అని జయ అన్నారు. ‘‘ పూరీగారు చెప్పినట్టు ‘వైశాఖం’ పెద్ద హిట్‌ కావడం ఖాయం’’ అన్నారు బీఏ రాజు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement