‘ఇది కొత్త తరహా చిత్రం’ | B.Jaya about vaisakham movie | Sakshi
Sakshi News home page

‘ఇది కొత్త తరహా చిత్రం’

Jan 10 2017 11:38 PM | Updated on Sep 5 2017 12:55 AM

‘ఇది కొత్త తరహా చిత్రం’

‘ఇది కొత్త తరహా చిత్రం’

‘‘నాన్నగారి మరణం నన్ను చాలా విషయాల్ని ఆలోచించేలా చేసింది.

‘‘నాన్నగారి మరణం నన్ను చాలా విషయాల్ని ఆలోచించేలా చేసింది. అప్పుడీ కథ రాశా. ప్రతి ఒక్కరూ మన లైఫ్‌లోనూ ఇలాంటి సంఘటన జరిగిందని సర్‌ప్రైజ్‌ అవుతారు’’ అన్నారు దర్శకురాలు బి. జయ. హరీశ్, అవంతిక జంటగా ఆమె దర్శకత్వంలో బీఏ రాజు నిర్మించిన సినిమా ‘వైశాఖం’. వచ్చే నెలలో ఆడియో, వేసవిలో సినిమా రిలీజ్‌.

ఈ సందర్భంగా నేడు పుట్టినరోజు జరుపుకొంటున్న బి. జయ మాట్లాడుతూ – ‘‘హీరో నివసించే అపార్ట్‌మెంట్‌లో దిగిన హీరోయిన్‌ అతణ్ణి ఎలా మార్చింది? ఆమె ఉద్దేశం ఏంటనేది కథ. అపార్ట్‌మెంట్‌లో కుటుంబాలన్నీ కలిసుంటే ఎంత అందంగా ఉంటుందనేది సినిమాలో చెబుతున్నాం. కజికిస్థాన్‌లో తీసిన పాటలు హైలైట్‌. ఇప్పటివరకూ నేను తీసిన సినిమాలు ఓ ఎత్తు. ఈ సినిమా మరో ఎత్తు. కొత్త తరహా చిత్రమిది’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement