‘‘మా గత చిత్రం ‘వైశాఖం’ నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఆడియన్స్ కూడా బాగా అప్రిషియేట్ చేశారు. ఆ సినిమాలో ఇచ్చిన మెసేజ్ అందరికీ నచ్చింది. అంతకుముందు తీసిన ‘లవ్లీ’ అప్రిషియేషన్స్‌తో పాటు కమర్షియల్‌గా కూడా మంచి సక్సెస్ అయింది. ‘లక్కీ ఫెలో’ సినిమా ‘లవ్లీ’ కంటే పెద్ద íß ట్ అవుతుంది’’ అని దర్శకురాలు జయ బి. అన్నారు. బుధవారం ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా జయ బి. తన కొత్త చిత్రం వివరాలను, ఇతర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
►ప్రస్తుతం కొత్త సినిమా ‘లక్కీ ఫెలో’ ప్రీ–ప్రొడక్షన్ పనులు చేస్తున్నాం. ఇది ‘వైశాఖం’ అంత లేట్ అవ్వదు. జూన్‌లో స్టార్ట్ చేసి నాలుగైదు నెలల్లో కంప్లీట్ చేస్తాం. మనలో కొంతమందికి అనుకోకుండా ఒక పెద్ద అవకాశం వస్తుంది. ఆ వ్యక్తిని అందరం ‘లక్కీ ఫెలో’ అంటాం. ఈ సినిమాలో హీరో లక్కీ ఫెలో. ఆ లక్‌ను అతను ఎలా తీసుకుంటాడు? అన్నది కథాంశం. హ్యూమన్ సైకాలజీని బేస్ చేసుకొని కథ తయారు చేశాం.
►హీరోయిన్‌ది కూడా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. సమాజంలో ఆడవాళ్లకు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అలాగని పెద్దవి ఉండవని కాదు. చిన్న సంఘటన అయినా మానసికంగా బాగా డిస్ట్రబ్ చేస్తుంది. టీనేజ్ అమ్మాయిలకైతే మరీను. హీరోయిన్ ఇలాంటి సెన్స్‌టీవ్ క్యారెక్టర్‌ని డీల్ చేస్తుంది. ఇప్పటివరకూ ఎవరూ ఈ పాయింట్‌ని టచ్ చేయలేదు. ఇప్పుడున్న యంగ్ హీరో హీరోయిన్లనే సెలెక్ట్ చేసుకుంటాం.
►నా ఫస్ట్ సినిమా ‘చంటిగాడు’ నుంచి ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ అవ్వలేదు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అండర్ కరెంట్‌లో మెసేజ్ ఉంటుంది. త్వరగా సినిమాలు తీసేసి ఆ తర్వాత జనంలోకి వెళ్లి సమాజానికి ఉపయోగపడే పనులేవైనా చేయాలని ఉంది. నేను జర్నలిస్టుగా ఉన్న రోజుల్లో కూడా నన్ను చూసి ఇన్‌స్పైర్ అయి, జర్నలిజంలోకి వచ్చినవాళ్లు చాలామంది ఉన్నారు. మహిళా దర్శకుల సంఖ్య పెరగాలి. మగాళ్లు ఇంకా ఆడవాళ్లు అప్పడాలు చేయడానికి, వండటానికి మాత్రమే అనుకుంటున్నారు. ఆ ఆలోచనలో మార్పు రావాలి.
ఆడవాళ్లంటే వంట చేయడానికే కాదు
Published Thu, Jan 11 2018 12:15 AM | Last Updated on Thu, Jan 11 2018 12:15 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment