బాహుబలి బ్లాక్బస్టర్ కావాలి: మహేశ్ | Everybody should be proud of Baahubali, says Mahesh Babu | Sakshi
Sakshi News home page

బాహుబలి బ్లాక్బస్టర్ కావాలి: మహేశ్

Published Thu, Jun 25 2015 6:06 PM | Last Updated on Sun, Sep 3 2017 4:21 AM

బాహుబలి బ్లాక్బస్టర్ కావాలి: మహేశ్

బాహుబలి బ్లాక్బస్టర్ కావాలి: మహేశ్

బాహుబలి సినిమాపై సూపర్స్టార్ మహేశ్బాబు ప్రశంసలు కురిపించాడు. సినిమా ప్రేమికుడన్న ప్రతి ఒక్కళ్లూ బాహుబలిని చూసి గర్వపడాలన్నాడు. ఈ సినిమా విజయం సాధించడం తెలుగు సినీపరిశ్రమకు చాలా కీలకమని చెప్పాడు. ఇది బ్లాక్బస్టర్ కావాలని అందరమూ ప్రార్థించాలని తెలిపాడు. ఓ ఆస్పత్రికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మహేశ్ ఈ విషయాలు చెప్పాడు.

జూలై 10వ తేదీన బాహుబలి విడుదల అవుతుండగా, సరిగ్గా దానికి వారం రోజుల తర్వాత.. అంటే జూలై 17న మహేశ్ నటించిన శ్రీమంతుడు విడుదల కావాల్సి ఉంది. అయితే, ఇప్పుడు దాన్ని ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేశారు. బాహుబలి అంటే భయపడి తాము తమ సినిమా విడుదలను వాయిదా వేయలేదని, సోలో రిలీజ్ కావాల్సిన అర్హత ఆ సినిమాకు ఉందని.. ఒక పెద్ద సినిమా విడుదలైన రెండు మూడు వారాల తర్వాత మరో సినిమా విడుదల కావడం ఆరోగ్యకరమని మహేశ్ చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement