
కండలవీరుడు... శ్రీమంతుడు?
సొంతూరికి ఏదైనా చేయాలనే శ్రీహర్ష పాత్రలో మహేశ్‌బాబు ఒదిగిపోయారు. మంచి కథా కథనాలతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బాక్సాఫీస్ దత్తత తీసుకుని విజయాన్నందించింది. ఇప్పుడీ సినిమా హిందీ రీమేక్‌లో నటించడానికి సల్మాన్‌ఖాన్ సుముఖత వ్యక్తం చేశారట. అలాగే నిర్మాతగా వ్యవహరించనున్నారని సమాచారం. గతంలోనే మహేశ్‌బాబు ‘పోకిరి’ని ‘వాంటెడ్’గా రీమేక్ చేసి తన కెరీర్‌లో ఓ మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. అన్నీ కుదిరితే ‘శ్రీమంతుడు’గా సల్మాన్ సందడిని వెండితెరపై చూడొచ్చు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయని భోగట్టా!