
'చేతిలో ఫుల్లు సినిమాలతో యమ బిజీ'
చెన్నై: చేతిలో నిండుగా సినిమాలతో నటుడు హరీశ్ ఉత్తమాన్ బిజిబిజీగా ఉన్నాడు. పాండియ నాడు చిత్రంలో గొప్ప నటనను ప్రదర్శించి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఆయన తెలుగు, తమిళ చిత్రాలతో తీరికలేకుండా సతమతమవుతున్నాడు. ప్రస్తుతం అతడు ప్రతినాయక పాత్ర పోషించిన శ్రీమంతుడు చిత్రం ఆగస్టు 7న విడుదల కానుంది. అందులో ఆయన తిరుగులేని విలన్ పాత్రను పోషించినట్లు చిత్ర వర్గాల సమాచారం.
ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ తెలుగులో తనకు ఇది నాలుగో చిత్రం అని చెప్పాడు. శ్రీమంతుడు చిత్రం తనకు చక్కటి భవిష్యత్తును ఇస్తుందన్న నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశాడు. దీంతోపాటు శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ఎక్స్ప్రెస్ రాజాలో కూడా నటిస్తున్నాడు. దీంతోపాటు తమిళంలో పాయుం పులి, విల్ అంబు, పైసల్ అనే చిత్రాలతో బిజీబిజీగా ఉన్నాడు.