జీవితగా వస్తున్న రాధికా శరత్‌ కుమార్‌.. | Sakshi
Sakshi News home page

జీవితగా వస్తున్న రాధికా శరత్‌ కుమార్‌..

Published Wed, Feb 15 2023 2:05 AM

Radhika Sarath Kumar as Jeevita in Operation Raavan movie - Sakshi

రక్షిత్‌ అట్లూరి హీరోగా, సంకీర్తనా విపిన్‌ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘ఆపరేషన్‌ రావణ్‌’. వెంకట సత్య దర్శకత్వంలో ధ్యాన్‌ అట్లూరి నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రంలో జీవితపాత్ర చేస్తున్న రాధికా శరత్‌కుమార్‌ లుక్‌ని విడుదల చేశారు.

‘‘స్వాతిముత్యం, స్వాతి కిరణం’ లాంటి ప్రజాదరణ పొందిన చిత్రాల తర్వాత ‘ఆపరేషన్‌ రావణ్‌’లో నటనకి ప్రాధాన్యం ఉన్న జీవితపాత్ర చేశాను. తెలుగుతోపాటు తమిళంలో ఏక కాలంలో విడుదల కానున్న ఈ చిత్రంలో నటించడం సంతోషంగా ఉంది’’ అన్నారు రాధిక.

Advertisement
 
Advertisement
 
Advertisement