
ముంబై: ఈ- కామర్స్ దిగ్గజం ఫిప్‌కార్ట్ ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలతో కస్టమర్లకు చేరువయ్యే ప్రణాళికలు రచిస్తోంది. తాజాగా తెలుగు, తమిళ, కన్నడ ప్రజలకు ప్లిప్‌కార్ట్ శుభవార్త తెలిపింది. ఇక మీదట (తెలుగు, తమిళ, కన్నడ భాషల)కు చెందిన వినియోగదారులు తమ ప్రాంతీయ భాషలలో షాపింగ్ చేయవచ్చని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ప్లిప్‌కార్ట్‌లో ఇప్పటివరకు కేవలం హిందీ మొబైల్ అప్లికేషన్‌కు మాత్రమే ఈ వెసలుబాటు ఉండేది. అయితే దేశ వ్యాప్తంగా ప్రాంతీయ భాషలలో సేవలను విస్తరించడం వల్ల వినియోగదారులకు సంస్థ మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తుంది. కాగా 54 ప్రాంతీయ భాషల పదాలను (తెలుగు, తమిళ, కన్నడ భాషలలో) బ్యానర్ పేజీలతో కలిపి వినియోగదారులకు అందించినట్లు పేర్కొంది.
గత సెప్టెంబర్‌లో హిందీ భాషలో వినియోగదారులకు సేవలను అందించామని ఫ్లిప్‌కార్ట్ గుర్తుచేసింది. హిందీ భాషలలో సేవలందించడం ద్వారా వినియోగదారులు సంతృప్తికరంగా ఉన్నారని, ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలలో భారీగా పెరుగుతున్న వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని.. వారికి భాషాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రాంతీయ భాషలలో సేవలందించనున్నట్లు తెలిపింది. ప్రాంతీయ భాషలలో సేవలందించే ప్రణాళికలో భాగంగా విశాఖపట్నం, మైసూర్‌లలో భాషలకు సంబంధించిన పదాలను అధ్యయనం చేశామని తెలిపింది. తాజా సేవలతో దేశవ్యాప్తంగా వినియోగదారులను ఫ్లిప్‌కార్ట్ ఆకట్టుకుంటుందని పేర్కొంది. (చదవండి: ఆహార రిటైల్‌లో ఫ్లిప్‌కార్ట్‌కు నో ఎంట్రీ!)
Comments
Please login to add a commentAdd a comment