నాలుగు భాషల్లో... | red alert movie audio released | Sakshi
Sakshi News home page

నాలుగు భాషల్లో...

Published Wed, Dec 17 2014 10:38 PM | Last Updated on Sat, Sep 2 2017 6:20 PM

నాలుగు భాషల్లో...

నాలుగు భాషల్లో...

‘‘ఈ కథ వినగానే, ముందు రెండు భాషల్లో చేద్దామని నిర్మాత అన్నారు. ఆ తర్వాత మూడు భాషల్లో చేస్తే బాగుంటుందన్నారు. చివరికి నాలుగు భాషల్లో చేసేద్దామన్నారు. కథ ఆయనకు అంత బాగా నచ్చింది. ఈ చిత్రం ద్వారా మిగతా మూడు దక్షిణాది భాషలకు పరిచయం కావడం ఆనందంగా ఉంది’’ అని దర్శకుడు చంద్రమహేశ్ అన్నారు. హెచ్.హెచ్. మహాదేవ్, అంజనా మీనన్ జంటగా చంద్రమహేశ్ దర్శకత్వంలో పీవీ శ్రీరామ్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘రెడ్ అలర్ట్’. ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు.
 
 ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ -‘‘నాలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందించిన చిత్రం ఇది. మొత్తం 5 రాష్ట్రాల్లో షూటింగ్ చేశాం’’ అన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందిన చిత్రానికి పాటలు స్వరపరచడం ఆనందంగా ఉందని రవివర్మ తెలిపారు. రచయిత శ్రీరామ్ చౌదరి, హీరో మహదేవ్, ఎడిటర్ గౌతంరాజు తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె. జైపాల్‌రెడ్డి, సమర్పణ: పి.ఎస్. త్రిలోక్‌రెడ్డి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement