
'ఆమెతో నటించే రోజూ వస్తుందనుకోలేదు'
హైదరాబాద్: ప్రముఖ నటుడు పద్మశ్రీ కమల్హాసన్కి తాను పెద్ద ఫ్యాన్ అని ప్రిన్స్ మహేశ్ బాబు వెల్లడించారు. ఆయన నటించిన ప్రతి సినిమా చూస్తానని చెప్పారు. అయితే కమల్హాసన్ కుమార్తె శృతీహాసన్తో కలిసి నటించే ఓ రోజూ వస్తుందని మాత్రం తాను ఎప్పుడు అనుకోలేదని... కనీసం తనకు ఊహకు కూడా రాలేదని తెలిపారు. శుక్రవారం మహేశ్ బాబు హైదరాబాద్లో మహేశ్ బాబు మాట్లాడుతూ... శృతీహాసన్ చాలా సహజంగా నటిస్తుందన్నారు. ఆమెతో కలసి పని చేయడం చాలా సులభమని చెప్పారు.
శృతీ ఎప్పుడు ఎంత హుందాగా ఉంటుందో అంతే శాంతంగా ఉంటుందన్నారు. మంచి డ్యాన్సరే కాదు మంచి గాయనిగా కూడా తన ప్రతిభను శృతీ చాలా చక్కగా నిరూపించుకున్నారని ఆమెపై మహేశ్ ప్రశంసల జల్లు కురిపించారు. శృతీ హాసన్, ప్రిన్స్ మహేశ్ బాబు హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం శ్రీమంతుడు. ఈ చిత్రం ఆగస్టు 7వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. గతంలో ఆగడు చిత్రంలో మహేశ్ బాబుతో కలసి శృతీహాసన్ స్పెషల్ సాంగ్ లో నటించిన విషయం విదితమే.