
తిరిగి ఇచ్చేయాలి... లేకపోతే లావైపోతారు!
అతని పేరు హర్ష. కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచారు అతని తల్లిదండ్రులు. ఎంత తిన్నా తరగని ఆస్తి.
అతని పేరు హర్ష. కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచారు అతని తల్లిదండ్రులు. ఎంత తిన్నా తరగని ఆస్తి. కానీ చిన్నతనం నుంచి హర్ష చాలా విభిన్నంగా ఉండేవాడు. తల్లిండ్రులకు కూడా అర్థమయ్యేవాడు కాదు. ఇంతకీ హర్ష లక్ష్యం ఏంటి? ఏకంగా ఓ ఊరిని దత్తత తీసుకోవాలని ఎందుకు అనుకున్నాడు? ఆ ఊళ్లోవాళ్ల కష్టాలను తీర్చడానికి అతనెలాంటి పోరాటం చేశాడు? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ‘శ్రీమంతుడు’ చిత్రం చూడాల్సిందే. మహేశ్‌బాబు, శ్రుతీహాసన్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, మోహన్ నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 7న విడుదల కానుంది.
ఇప్పటికే ప్రచారం చిత్రంలో ‘‘ఒరేయ్! ఊరి నుంచి చాలా తీసుకున్నారు. తిరిగిచ్చేయాలి లేకపోతే లావైపోతారు’’ అని మహేశ్ బాబు చెప్పిన డైలాగ్, ఇటీవల విడుదలైన పాటలు భారీ అంచనాలు పెంచాయి. ‘‘అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ఈ చిత్రాన్ని తమిళంలో ‘సెల్వందన్’ పేరుతో అనువదించి, విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: మది, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చంద్రశేఖర్ రావి పాటి.