మహేశ్ బాబు మధురానుభూతి | Mahesh babu tweets on srimanthudu one year celebrations | Sakshi
Sakshi News home page

మహేశ్ బాబు మధురానుభూతి

Published Sun, Aug 7 2016 11:20 AM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM

మహేశ్ బాబు మధురానుభూతి

మహేశ్ బాబు మధురానుభూతి

ఒక యావరేజ్, రెండు డిజాస్టర్ల తర్వాత ఏ హీరో అయినా ప్రయోగం చేయడానికి సిద్ధపడతాడా? అదికూడా.. సింపుల్ గా సైకిల్ తొక్కుతూ, లుంగీ కట్టుకొని నడుస్తూ, గ్రామాన్ని ఉద్ధరించే క్యారెక్టర్ మీదని దర్శకుడు చెబితే.. 'సరే' అనడం కుదిరేపనేనా! స్టార్ డమ్ చట్రంలో ఇరుక్కుపోయిన ఏ హీరో అలాంటి సాహసానికి 'సరే' అనడు.. ఒక్క మహేశ్ బాబు తప్ప! అలా సరిగ్గా ఏడాది కిందట అతను చేసిన సినీ ప్రయోగం.. సామాజికంగానూ పెను మార్పులకు కారణమైంది.   (గోల్డెన్ చాన్స్ కొట్టేసిన రకుల్ ప్రీత్)

కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన 'శ్రీమంతుడు' సినిమాని ఆదర్శంగా తీసుకుని చాలామంది ధనవంతులు, ఎన్నారైలు తమ ఊళ్లను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. 2015, ఆగస్టు 7న విడుదలైన 'శ్రీమంతుడు' నేటితో ఏడాది పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ప్రిన్స్ మహేశ్ బాబు 'శ్రీమంతుడు' అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. 'ఒక్కసారి వెన్కి తరిగి చూసుకుంటే శ్రీమంతుడు టీంతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషాన్నిచ్చింది. అవి మధురానుభూతులు. ఇంతకాలం ప్రేమను పంచినందుకు కృతజ్ఞతలు' అంటూ ట్విట్టర్ వేదికగా మనసులో మాటలను వెల్లడించారు. హీరోయిన్ శృతి హాసన్ కూడా శ్రీమంతుడు గుర్తుల్ని వల్లెవేసుకున్నారు.  (మహేష్ లుక్ ఇదేనా..?)

ప్రస్తుతం మహేశ్ బాబు.. మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. రకుల్ ప్రీత్ హీరోయిన్ కాగా, దర్శకుడు ఎస్ జే సూర్య విలన్ గా నటిస్తున్నారు. మహేశ్ బాబు పుట్టినరోజు(ఆగస్టు 9) సందర్భంగా కొత్త సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు.  (పుట్టిన రోజున అభిమానులకు మహేష్ గిఫ్ట్)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement