మహేష్ను భయపెట్టిన మగధీర | Mahesh feared about magadheera | Sakshi
Sakshi News home page

మహేష్ను భయపెట్టిన మగధీర

Published Tue, Sep 15 2015 1:34 PM | Last Updated on Sun, Sep 3 2017 9:27 AM

మహేష్ను భయపెట్టిన మగధీర

మహేష్ను భయపెట్టిన మగధీర

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ఇటీవల మగధీర సినిమా వల్ల భయపడ్డాడు.. అదేంటి ఎప్పుడో రిలీజ్ అయిన మగధీర ఇప్పుడు మహేష్ ను భయపెట్టడం ఏంటి అనుకుంటున్నారా.. అవునండి శ్రీమంతుడు సినిమా రిలీజ్ సమయంలో మగధీర సినిమా గుర్తుకు వచ్చిన మహేష్ చాలా టెన్షన్ పడ్డాడట. ఈ విషయాన్ని స్వయంగా మహేషే ప్రకటించాడు. శ్రీమంతుడు సినిమా తరువాత ఎంతో ఆనందంగా తన నెక్ట్స్ సినిమా బ్రహ్మోత్సవం షూటింగ్ స్టార్ట్ చేసిన సూపర్ స్టార్.. ఈ మూవీ రిలీజ్కు ఒక రోజు ముందు తన పరిస్థితిని వివరించాడు.

' శ్రీమంతుడు సినిమా ఎంతకలెక్ట్ చేసింది అన్న విషయం అప్రస్తుతం, ఈ సినిమా బిగ్ హిట్. ఇప్పుడు అందరూ హ్యాపి, కాని రిలీజ్కు ముందు రోజు మాత్రం నేను చాలా టెన్షన్ పడ్డాను. ముఖ్యంగా మగధీర లాంటి బిగ్ హిట్ సినిమా తరువాత దాదాపు రెండు నెలల పాటు ఏ సినిమా కూడా సక్సెస్ కాలేదు. బాహుబలి సక్సెస్ తరువాత కూడా అలాంటి పరిస్థితులే ఏర్పడ్డాయి. అందుకే శ్రీమంతుడు రిలీజ్ తనను మరింత టెన్షన్ కు గురిచేసింది.' అంటూ ఆ రోజు తన టెన్షన్ గుర్తు చేసుకున్నాడు మహేష్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement