
'సెల్వందన్'గా మహేష్ బాబు 'శ్రీమంతుడు'
చెన్నై: మహేష్ బాబు తాజా చిత్రం 'శ్రీమంతుడు'ను తమిళంలోకి డబ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 'సెల్వందన్' పేరుతో తమిళనాడులో విడుదల చేస్తున్నారు.
కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు చిత్రం వచ్చే నెల 7న విడుదల చేస్తున్నారు. తమిళంలోకి అనువదించిన సెల్వందన్ కూడా కూడా అదే రోజు విడుదల కానుంది. తమిళనాడులో మహేష్ బాబుకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీమంతుడు చిత్రాన్ని తమిళంలోకి డబ్ చేసినట్టు యూనిట్ వర్గాలు తెలిపాయి. 70 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రంలో మహేష్ సరసన శృతి హాసన్ నటించారు.