
చరణ్, కొరటాల సినిమా ఆగిపోలేదా..?
బ్రూస్ లీ ఫెయిల్యూర్తో ఆలోచనలో పడ్డ రామ్ చరణ్ తిరిగి ఫాంలోకి రావడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తనీ ఒరువన్ రీమేక్లో నటిస్తున్న చెర్రీ. ఆ సినిమా తరువాత కూడా ఇంట్రస్టింగ్ కాంబినేషన్ల కోసం ట్రై చేస్తున్నాడు. గతంలో ఆగిపోయిన ప్రాజెక్ట్స్ విషయంలో కూడా పునరాలోచన చేస్తోన్నాడు మెగా పవర్ స్టార్.
మిర్చి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన కొరటాల శివ తన రెండో సినిమాగా రామ్ చరణ్ హీరోగా ఓ చిత్రాన్ని ప్రారంభించాడు. బండ్ల గణేష్ నిర్మాతగా పూజా కార్యక్రమాలు కూడా జరుపుకున్న ఈ సినిమా తరువాత రెగ్యులర్ షూటింగ్కు వెళ్లకుండానే ఆగిపోయింది. దీంతో ఇక ఆ ప్రాజెక్ట్ లేనట్టే అని భావించారు అంతా. తరువాత శ్రీమంతుడు సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్లను తిరగరాసిన కొరటాలతో ఇప్పుడు సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు చెర్రీ.
కొరటాల ప్రస్తుతం ఎన్టీఆర్తో చేస్తున్న జనతా గ్యారేజ్ సినిమా తరువాత చరణ్ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే ఇది గతంలో ఆగిపోయిన సినిమానేనా..? లేక కొత్త కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తార అన్న విషయం మాత్రం అఫీషియల్ ఎనౌన్స్మెంట్ తరువాతే తెలిసే అవకాశం ఉంది.