
జీవితంలోనే అత్యంత సంతోషమైన రోజు: మహేశ్
ఎప్పుడూ తన సినిమాల గురించి పెద్దగా మాట్లాడని మహేశ్ బాబు.. శ్రీమంతుడు సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ చూసి ఊరుకోలేకపోయాడు. తన జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజుల్లో ఇదొకటని ట్వీట్ చేశాడు. శ్రీమంతుడు సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని, ఇది చూసి చాలా సంతోషిస్తున్నానంటూ.. 'లవ్యూ ఆల్' అని చెప్పాడు.
శ్రీమంతుడు సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. అంతర్జాతీయంగా కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. అమెరికాలో కూడా సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నట్లు ట్వీట్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద కొందరు అభిమానులు ప్రీమియర్ షోతో మొదలుపెట్టి.. నాలుగు షోలకు టికెట్లు ఉన్నాయని చెబుతున్నారు. ఇవన్నీ చూసి మహేశ్ బాబు మంచి ఖుషీగా ఉన్నట్లు తెలుస్తోంది.
1 of the happiest days of my life .. Overwhelming response for Srimanthudu ..humbled .. Love you all..
— Mahesh Babu (@urstrulyMahesh) August 7, 2015