శ్రీమంతుడు.. సీన్ బై సీన్
కొరటాల దర్శకత్వంలో, సూపర్ స్టార్ మహేశ్బాబు హీరోగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన శ్రీమంతుడు ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాలో హర్ష క్యారెక్టర్లో మరింత ఎలివేట్ అయ్యాడు. కాలేజీ బోయ్లాగా అమ్మాయిలను మనుసులను దోచేశాడు.
మహేష్ ఛార్మ్, అద్బుతమైన సినిమాటోగ్రఫీ దేవీశ్రీ మ్యూజిక్ మ్యాజిక్ చేశాయి.
ప్రధాని నరేంద్ర మోదీ అదర్శ్ గ్రామ యోజన పథకానికి సెల్యులాయిడ్ ఎలిమెంట్స్ జోడించినట్టుగా మన జన్మభూమికి ఎంతో కొంత సేవ చేయండంటూ చిన్నపాటి మెసేజ్తో వచ్చిన ఈ మూవీ విశేషాలు ఇవీ..
- తెరపై మహేష్ బాబును చూసిన ఫ్యాన్స్ పండగే అని చెప్పాలి. నవయువకుడిలాగా మెరిసిపోతున్న యువరాజు ని చూసి అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బియ్యేంత అద్భుతంగా ఉంది హర్షవర్ధన్ పాత్ర. అద్భుతమైన పెర్ఫామెన్స్తో అదరగొట్టేశాడు.
- రామ రామ అంటూ అద్భుతమైన పాటతో హీరో ఎంటరవుతాడు. ఏ మాత్రం వయసు కనిపించకుండా అచ్చం కాలేజీ కుర్రాడిలా కనువిందు చేశాడు.
- ఇక మొదటి సారి మహేష్ బాబుతో పూర్తిస్థాయిలో స్క్రీన్ పంచుకుంటున్న శృతిహాసన్ అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే... ప్రెటీ లుక్స్తో ఈ అందాల రాశి ఎంట్రీ చాలా గ్రాండ్గా ఉంది.
- మహేశ్ తండ్రి పాత్ర చేసిన జగపతిబాబు క్యారెక్టర్ కూడా చాలా రిచ్గా ఉంది. సినిమాకే హైలైట్గా నిలిచింది. ధనవంతుడి తండ్రి పాత్రలో ఆయన అడుగడుగునా హుందాతనాన్ని, దర్పాన్ని ఒలికిస్తూ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.
- ఈ సందర్భంగా తండ్రీ కొడుకుల మధ్య సంభాషణలు హృదయానికి హత్తుకునేలా ఆకట్టుకుంటాయి.
- ప్రిన్స్ చురుకైన చూపులతో సొగసుగా అలరిస్తే.. జగపతి పాత్ర కొంచెం గడుసుగా, మరింత గంభీరంగా ఉండి.. అన్ని వయసుల ప్రేక్షకుల మనసులను దోచుకుంటాయి. వారిద్దరి మధ్య సాగే గంభీరమైన, రసవత్తరమైన డైలాగులు మళ్లీ మళ్లీ వినాలనిపించేలా.. బావున్నాయి.
- మహేశ్బాబు మైమరిపించే అందానికి తోడు ఆసక్తికరమై కాలేజీ వాతావరణం, అద్భుతమైన దృశ్యాలు మరింత అందంగా ఒదిగిపోయాయి.
- సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర,విలన సంపత్ (శశి) ఎంటరవుతాడు.
- అద్భుతమైన సాహిత్యానికి సంగీతం జత కలిస్తే ఆవిష్కరించే పాటే 'జత కలిసే'.... స్క్రీన్ మీద అభిమానులకు పండగ చేసింది.
- స్క్రీన్ ప్లే చాలా పకడ్బందీగా చాలా ఆకర్షణీయంగా ఉంది. మహేశ్బాబు రెట్టించిన అందంతో ఫుల్ మార్కులు కొట్టేశాడు.
- ఇంతలో కథలో ఓ చిన్న ట్విస్ట్. దీంతో సినిమాలో సీరియస్ వాతావరణం వచ్చేస్తుంది.
- మహేశ్, శృతిల మధ్య ప్రేమ సన్నివేశాలు చాలా హృద్యంగా, అందంగా ఉంటాయి. వాస్తవానికి దగ్గరగా ఉండి మనసును హత్తుకుంటాయి.
- మూడోపాట 'చారుశీల స్వప్నబాల'కు అభిమానులు ఈలలు, కేకలతో గోల చెయ్యాల్సిందే. కేరింతలు కొట్టాల్సిందే.
- కథలో మరో ఆసక్తికర మలుపునకు నాంది నాలుగో పాట . ఇంటర్వెల్.
- ఫస్ట్ హాఫ్ మాంచి ఫీల్తో పరిగెట్టి, సెకండాఫ్కి వచ్చేసరికి ఎమోషన్స్ బీట్స్తో, ప్రెడిక్టబుల్ క్లైమాక్స్తో స్లో అయ్యింది. అయినా ఓకే.
- మహేశ్ బాబు, అలీ మధ్య కామెడీ కడుపుబ్బ నవ్విస్తుంది. కామెడీ సీన్లను పండించడంలో మరోసారి హీరో సక్సెస్ అయ్యాడు.
- విలన్లతో ఘర్షణపడే సన్నివేశంతో సెకండ్ హాఫ్ మొదలవుతుంది. లెంగ్తీ డైలాగులు కాకుండా చిన్నగా, సూటిగా ఉంటాయి. డైలాగ్ డెలివరీ అద్భుతం.
- తమ గ్రామస్తులను ఆకట్టుకొని, గ్రామ అభివృద్ధికి తోడ్పడేందుకు ప్రయత్నిస్తాడు హీరో. గ్రామ వికాసమే తమ వికాసమని వారు తెలిసుకునేలా చేస్తాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ సన్నివేశాలు కంటికి ఇంపుగా ఉంటాయి.
- పల్లెటూరి లొకేషన్స్, క్యారెక్టర్స్ అదిరిపోయాయి. చాలా సింపుల్గా , క్యూట్గా ఈ సన్నివేశాల్లో మహేశ్ మరింత ఆకట్టుకుంటాడు.
- ఈ సందర్భంగా వచ్చే ఒక మోటివేషనల్ సాంగ్, లోగోలో మోదీ ఛాయలు లీలగా మనకు కనిపిస్తాయి.
- ఇక విలన్, కథానాయకుడి మధ్య వచ్చే భయంకరమైన సన్నివేశాలతో కథ మరో కీలకమలుపు తిరుగుతుంది. యాక్షన్ సన్నివేశాలతో సినిమాలో లీనమైపోతాడు ప్రేక్షకుడు. కన్నార్పకుండా కథలో మమేకమైపోతాడు.
- ఇంతటి గంభీరమైన వాతావరణంలో ఆఖరిపాట ఆకట్టుకుంటుంది. దిమ్మతిరిగే.. అంటూ సాగే ఈ మాంచి మాస్ మసాలాతో కొంచెం రిలీఫ్ అవుతాడు ప్రేక్షకుడు.
- అయితే మహేశ్ సినిమాలు రెగ్యులర్గా ఫాలో అయ్యేవారికి కొత్తగానూ, అదే సమయంలో ఎమోషన్ సీన్స్ బేస్గా నడుస్తుంది.
- కలెక్షన్ల పరంగా శ్రీమంతుడు ఫుల్ సక్సెస్ అయ్యేలా ఉంది.