
శ్రీమంతుడు సినిమా మేకింగ్ విశేషాలివీ..
బాహుబలి తర్వాత వచ్చినా.. సూపర్హిట్ టాక్తో నడుస్తున్న శ్రీమంతుడు సినిమా గురించిన విశేషాలను ప్రేక్షకులతో నిర్మాణ సంస్థ వాళ్లు పంచుకున్నారు. ఈ వీడియోను మహేశ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా 'ఫన్ టైమ్స్ :) ' అంటూ షేర్ చేశారు.
ప్రధాన పాత్రధారులు మహేశ్ బాబు, శ్రుతిహాసన్, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, దర్శకుడు కొరటాల శివ.. వీళ్లంతా ఈ సినిమా గురించి చెప్పిన విశేషాలతో పాటు.. సినిమాలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, మేకింగ్ వీడియోలు అన్నింటినీ ఇందులో పొందుపరిచారు. పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, సినిమాలో మరో కీలక నటుడు రాహుల్ రవీంద్రన్ లాంటి వాళ్లు కూడా తమ అభిప్రాయాలను ఈ వీడియోలో పంచుకున్నారు. సినిమా షూటింగ్ విశేషాలను కూడా చూపించడం మరో ఆసక్తికరమైన అంశం. సినీ నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ ఈ వీడియోను యూట్యూబ్ ద్వారా అందించింది. ఈ లింకును మహేశ్ బాబు తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు.
Fun times :) https://t.co/VoujlvsEBw
— Mahesh Babu (@urstrulyMahesh) August 11, 2015