ఆ దర్శకులతో సూపర్ స్టార్
ఆ దర్శకులతో సూపర్ స్టార్
Published Tue, Apr 12 2016 8:35 AM | Last Updated on Sun, Sep 3 2017 9:47 PM
ఇన్నాళ్లు తెలుగు సినిమా, తెలుగు టెక్నిషియన్లు అంటూ ఇక్కడే కాలం గడిపేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు రూట్ మార్చాడు. మార్కెట్ను విస్తరించుకునేందుకు పరభాషా దర్శకుల మీద దృష్టిపెడుతున్నాడు. ఇప్పటికే శ్రీమంతుడు సినిమాను తమిళ్లో కూడా రిలీజ్ చేసిన మహేష్. తన నెక్ట్స్ సినిమాను బైలింగ్యువల్గా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు.
ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్న మహేష్, ఆ సినిమా పూర్తవ్వగానే తమిళ స్టార్ డైరెక్టర్ మురుగుదాస్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తరువాత కూడా తమిళ దర్శకులతోనే పనిచేసే ఆలోచనలో ఉన్నాడు ప్రిన్స్. విజయ్ హీరోగా తెరకెక్కిన తేరి సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్న అట్లీ దర్వకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న టాక్ వినిపిస్తోంది.
వీళ్లేకాదు తమిళ నాట మాస్ డైరెక్టర్గా పేరున్న లింగుసామి, మహేష్ హీరోగా ఓ యాక్షన్ డ్రామా తెరకెక్కించాలని చాలారోజులుగా ప్రయత్నిస్తున్నాడు. తనీఒరువన్ సినిమాతో నేషనల్ లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న జయం రాజా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తానంటూ మహేష్ స్వయంగా మాట ఇచ్చాడు. ఇలా వరుసగా తమిళ దర్శకులతోనే సినిమాలు ప్లాన్ చేస్తున్న మహేష్, మన దర్శకులకు టైం ఎప్పుడిస్తాడో మరి.
Advertisement
Advertisement