
ఆలోచింపజేసే 'శ్రీమంతుడు' డైలాగులు..
కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ బాబు కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం శ్రీమంతుడు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం అరుదైన కలెక్షన్లను రాబడుతోంది. అయితే ఈ సినిమాలో కొన్ని డైలాగులు ప్రతి మనిషిని ఆలోచింపజేస్తున్నాయి. ఈ చిత్ర దర్శకుడు కొరటాల శివ స్వతహాగా రచయిత కావడంతో చక్కని డైలాగులు రాశారు. మహేశ్ బాడీలాంగ్వేజ్‌కు తగ్గట్టుగా ఉంటాయి సంభాషణలు. ఎక్కడా భారీ డైలాగులు వినిపించవు.
‘ఎదుగుదల అంటే మన చుట్టూ ఉన్నవాళ్లు ఎదగడం’, ‘సాటి మనిషి కష్టాన్ని చూడకపోతే మనం భూమ్మీద సంఘంలో బతకడం ఎందుకు?’ లాంటి డైలాగులు సున్నితంగా మనసును తాకుతాయి. ‘ఊరు చాలా ఇచ్చింది. ఎంతోకొంత తిరిగి ఇచ్చేయాలి. లేకపోతే లావయిపోతారు’ లాంటి డైలాగులు వినోదాన్ని ఇస్తూనే ఆలోచింపజేస్తాయి. ఈ డైలాగుల్ని మహేశ్ పలికే విధానం చాలా బాగుంది.