భారతదేశంలోని చాలా రాష్ట్రాలు భారీ వర్షాలతో అతాలకుతలమవుతున్నాయి. ఢిల్లీ వరద బీభత్సం అలా ముగిసిందో లేదో దేశవ్యాప్తంగా వానలు ముంచెత్తాయి. ముఖ్యంగా గుజరాత్‌లోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలతో అనేక ప్రాంతాలలో వరద తీవ్ర పరిస్థితి నెలకొంది. ఇక్కడ అత్యంత ప్రభావిత ప్రాంతాల్లో జునాగఢ్ నగరం ఒకటి. తీవ్రమైన వర్షాలతో నదులు, డ్యామ్‌లు పొంగిపొర్లుతున్నాయి. ఫలితంగా చాలా గ్రామాలు నీట మునిగాయి. ఈ సందర్బంగా అనేక విలువైన వాహనాలు డజన్ల కొద్దీ నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. (మారుతి జిమ్నీని సింగిల్ బెడ్‌తో అలా మార్చేసిన జంట; వైరల్ వీడియో)
గుజరాత్ వరదల్లో కార్లు
భారీ వర్షపాతం కారణంగా ఒక రెసిడెన్షియల్ సొసైటీ వెలుపల పార్క్ చేసిన అనేక వాహనాలు వరద నీటిలోకొట్టుకుపోయాయి. ఈ వీడియోను ఆర్తి తన ట్విటర్ పేజీలో షేర్ చేశారు. నదిని తలపిస్తున్న వీధిలో మహీంద్రా XUV500, మారుతిడిజైర్ దాదాపు పూర్తిగా మునిగిపోయింది. ఈ రెండు కార్లు కాకుండా, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 తదితర కార్లు కొట్టుకుపోతున్న వీడియో కూడా వెలుగులోకి వచ్చింది ఇంకా ఈ భయంకరమైన వీడియోలో స్కూటర్లు , బైక్‌లు కూడా నీటి మునిగాయి. దీంతో పాటు కొన్ని పశువులు కూడా కొట్టుకు పోవడం ఆందోళన రేపింది. అలాగే వందలాది వంటగ్యాస్ సిలిండర్లు కొట్టుకుపోతున్న వీడియో కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. కాగా భారత వాతావరణ శాఖ ఇప్పటికే గుజరాత్‌లోని వివిధ జిల్లాలకు నిన్నటి(జూలై 24) వరకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. (ఐటీ రిటర్న్ గడువులోగా ఫైల్ చేయండి..లేదంటే?)
అటు డిల్లీలోని యమునా ఉపనది హిండన్ నది నీటిమట్టం పెరిగింది. దీంతో నోయిడాలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. అలాగే ఎకోటెక్ 3 సమీపంలోని పార్కింగ్ చేసిన వందలాది కార్లు నీటమునిగాయి. ఓలా పాత, రీపేర్ అయిన కార్లను కంపెనీ ఇక్కడ పార్క్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ కార్లన్నీ వరద నీటిలో మునిగిపోయాయి.
Horrifying scenes from #GujaratFloods pic.twitter.com/ae3CqbSQN5
— Aarti (@aartic02) July 23, 2023
Heavy rains trigger flash floods in Gujarat's Junagadh; animals, cars swept away. #GujaratFloods #GujaratModel pic.twitter.com/m8XoZkLrnO
— INDER KUMAR 🇮🇳💙 (@InderKumar1895) July 23, 2023
Comments
Please login to add a commentAdd a comment