Mahindra XUV 500
-
ఫ్యామిలీ వ్యాన్ లైఫ్
ఒక ఎస్యువి ఉంటే భ్రమణకాంక్ష ఉన్న జీవిత భాగస్వామి దొరికితే ఆ వెహికల్‌నే ఇల్లుగా మార్చుకుని దేశంలోని అందమైన ప్రకృతిని చూస్తూ గడిపేయవచ్చా? చిక్కి, కపిల్ అనే దంపతులు తమ ఇద్దరు పిల్లలతో ప్రయాణాలకు తగ్గట్టుగా మార్చుకున్న వాహనంలో ఇలాగే తిరుగుతున్నారు. వైరల్ అయిన వారి ‘ఫ్యామిలీ వ్యాన్ లైఫ్’ గురించి... తిరిగే వాళ్లు ఎలాగైనా తిరుగుతారు. కాని కొందరు స్పెషల్. సొంతగా క్రెటా, మహింద్రా 400, ట్రైబర్... లాంటి పెద్ద బండి ఉంటే దానిని కస్టమైజ్డ్ ఇంటీరియర్స్‌తో క్యాంపర్ వ్యాన్‌గా మార్చుకుని కుటుంబం మొత్తం తిరిగే బృందాలు ఇప్పుడు ఇండియాలో పెరిగాయి. క్యాంపర్ వ్యాన్ ఉంటే రిజర్వేషన్లు అక్కర్లేదు. హోటల్ రూమ్‌లు అవసరం లేదు. సమయానికి చేరుకోకపోతే ఫ్లయిట్ మిస్ అవుతామన్న ఆందోళనా లేదు. బండే బస. బండే ప్రయాణ సాధనం. చిక్కి, కపిల్ అనే దంపతులు తమ ఇద్దరు పిల్లలతో సొంత ఫ్యామిలీ వ్యాన్‌లో దేశమంతా తిరుగుతూ, ‘ఘుమ్మక్కడ్ బగ్స్’ పేరుతో యూట్యూబ్ చానల్లో వీడియోలు పోస్ట్ చేస్తూ పాపులర్ అయ్యారు. వీరికి ఐదు లక్షల మంది ఫాలోయెర్స్ ఉన్నారు. మహింద్రా 500 వాహనం డిక్కీని వీరు పూర్తి స్థాయి కిచెన్‌గా తయారు చేయించుకున్నారు. లోపలి సీట్లను బెడ్స్‌గా మార్చుకునేలా ఆల్టర్ చేయించారు. ఇవి కాకుండా హాల్ట్ చేసిన చోట బండి మీద టాప్ టెంట్ వేసుకుంటారు. బండికి ఆనుకుని చేంజింగ్ రూమ్ ఫాలిథిన్ కవర్స్‌తో ఏర్పాటు చేసుకుంటారు. దూరంగా గుంత తవ్వి చుట్టూ పాలిథిన్ çకవర్స్‌తో లావెటరీ ఏర్పాటు చేసుకుంటారు. బండిలోనే గ్యాస్, వంట దినుసులు, కూరగాయలు అన్నీ పెట్టుకునే వీలుంటుంది. కపిల్ బండి నడిపితే ఆగిన చోటల్లా చకచకా వంట ముగిస్తుంది చిక్కి. బయటి తిండి వల్ల ఆరోగ్యం పాడవడం ఒక్కటే కాదు.. సమయానికి తిండి దొరక్కపోతే ఇబ్బంది కనుక ఈ ఏర్పాటు. అందుకే వీరు దిగులూ చింతా లేకుండా తిరుగుతూ ఉంటారు. వీరి పాపులారిటీ చూసి మరికొన్ని కుటుంబాలు తమ క్యాంపర్ వ్యాన్లతో వీరిని కలుస్తుంటాయి. అందరూ కలిసి గ్రూప్ క్యాంపింగ్ చేసి సరదాగా వొండుకుంటూ, ప్రకృతిని చూస్తూ. అక్కడే నిద్రపోతూ హాయిగా గడిపేస్తుంటారు. జీవితం అంటే అందమైన ప్రయాణం. చిక్కి, కపిల్ వీడియోల మీద ఆదాయం గడించడమే కాదు... గ్రూప్ క్యాంపింగ్ నిర్వహిస్తూ అలా కూడా డబ్బు గడిస్తున్నారు. టెన్ టు ఫైవ్ ఆఫీసుకు వెళుతూ సంపాదించేవారు ఎక్కువ మందైతే ఇలా రోజుకో కొత్త ప్రాంతంలో గడుపుతూ సంపాదించడం భిన్నమే కదా. -
వరదల్లో కొట్టుకుపోతున్న మహీంద్ర, మారుతి కార్లు వైరల్ వీడియో
భారతదేశంలోని చాలా రాష్ట్రాలు భారీ వర్షాలతో అతాలకుతలమవుతున్నాయి. ఢిల్లీ వరద బీభత్సం అలా ముగిసిందో లేదో దేశవ్యాప్తంగా వానలు ముంచెత్తాయి. ముఖ్యంగా గుజరాత్‌లోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలతో అనేక ప్రాంతాలలో వరద తీవ్ర పరిస్థితి నెలకొంది. ఇక్కడ అత్యంత ప్రభావిత ప్రాంతాల్లో జునాగఢ్ నగరం ఒకటి. తీవ్రమైన వర్షాలతో నదులు, డ్యామ్‌లు పొంగిపొర్లుతున్నాయి. ఫలితంగా చాలా గ్రామాలు నీట మునిగాయి. ఈ సందర్బంగా అనేక విలువైన వాహనాలు డజన్ల కొద్దీ నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. (మారుతి జిమ్నీని సింగిల్ బెడ్‌తో అలా మార్చేసిన జంట; వైరల్ వీడియో) గుజరాత్ వరదల్లో కార్లు భారీ వర్షపాతం కారణంగా ఒక రెసిడెన్షియల్ సొసైటీ వెలుపల పార్క్ చేసిన అనేక వాహనాలు వరద నీటిలోకొట్టుకుపోయాయి. ఈ వీడియోను ఆర్తి తన ట్విటర్ పేజీలో షేర్ చేశారు. నదిని తలపిస్తున్న వీధిలో మహీంద్రా XUV500, మారుతిడిజైర్ దాదాపు పూర్తిగా మునిగిపోయింది. ఈ రెండు కార్లు కాకుండా, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 తదితర కార్లు కొట్టుకుపోతున్న వీడియో కూడా వెలుగులోకి వచ్చింది ఇంకా ఈ భయంకరమైన వీడియోలో స్కూటర్లు , బైక్‌లు కూడా నీటి మునిగాయి. దీంతో పాటు కొన్ని పశువులు కూడా కొట్టుకు పోవడం ఆందోళన రేపింది. అలాగే వందలాది వంటగ్యాస్ సిలిండర్లు కొట్టుకుపోతున్న వీడియో కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. కాగా భారత వాతావరణ శాఖ ఇప్పటికే గుజరాత్‌లోని వివిధ జిల్లాలకు నిన్నటి(జూలై 24) వరకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. (ఐటీ రిటర్న్ గడువులోగా ఫైల్ చేయండి..లేదంటే?) అటు డిల్లీలోని యమునా ఉపనది హిండన్ నది నీటిమట్టం పెరిగింది. దీంతో నోయిడాలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. అలాగే ఎకోటెక్ 3 సమీపంలోని పార్కింగ్ చేసిన వందలాది కార్లు నీటమునిగాయి. ఓలా పాత, రీపేర్ అయిన కార్లను కంపెనీ ఇక్కడ పార్క్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ కార్లన్నీ వరద నీటిలో మునిగిపోయాయి. Horrifying scenes from #GujaratFloods pic.twitter.com/ae3CqbSQN5 — Aarti (@aartic02) July 23, 2023 Heavy rains trigger flash floods in Gujarat's Junagadh; animals, cars swept away. #GujaratFloods #GujaratModel pic.twitter.com/m8XoZkLrnO — INDER KUMAR 🇮🇳💙 (@InderKumar1895) July 23, 2023 -
కొత్త కారు కొన్న ముక్కు అవినాశ్, తిట్టిపోస్తున్న నెటిజన్లు
జబర్దస్త్ షోతో కమెడియన్‌గా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు ముక్కు అవినాశ్. తన పంచులతో, కామెడీ స్కిట్లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోలలో కూడా అవినాశ్ పార్టిసిపేట్ చేస్తూ జనాలను ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఆ మధ్య బిగ్‌బాస్‌కు కూడా వెళ్లి తన కామెడీతో షోకి కొత్త కళను తీసుకొచ్చాడు. మొత్తంగా అవినాశ్ ఎక్కడుంటే అక్కడ నవ్వుల పండగే అన్న పేరు తెచ్చుకున్నాడు. ఇకపోతే అవినాశ్ భార్య అనూజ ప్రస్తుతం గర్భిణి అన్న సంగతి తెలిసిందే! ఓపక్క తండ్రి కాబోతున్నాడని సంతోషించే లోపే అతడి తల్లి మల్లమ్మ అనారోగ్యంతో ఆస్పత్రిపాలైంది. ఇటీవలే మల్లమ్మకు గుండెలో స్టంట్స్ పడ్డాయి. ఈ విషయాన్ని అవినాశ్ స్వయంగా యూట్యూబ్ ఛానల్లో వెల్లడించాడు. ఇప్పుడిప్పుడే ఆమె ఆరోగ్యం కుదుటపడుతోంది. ఈ సమయంలో అవినాశ్ కొత్త కారు కొన్నాడు. పాత కారుకు యాక్సిడెంట్ అయిందని, అది డ్యామేజ్ కావడంతో దాన్ని ఎక్స్చేంజ్ చేసి కొత్త కారు కొన్నట్లు తెలిపాడు. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కారును కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు. దీని ధర దాదాపు రూ.25 లక్షల మేర ఉంటుందని తెలుస్తోంది. ఈ కారుకు పూజ చేయించిన వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో షేర్ చేశాడు. చాలామంది అభిమానులు అతడికి శుభాకాంక్షలు చెప్తుంటే కొంతమంది మాత్రం అవినాశ్‌పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. 'అమ్మకు గుండెపోటు వచ్చి స్టంట్స్ వేయించుకుని అనారోగ్యంతో బాధపడుతుంటే ఇప్పుడు కొత్త కారు తీసుకోవడం అవసరమా?' అని కామెంట్లు చేస్తున్నారు. 'మీ అమ్మకు ఆరోగ్యం బాగోలేదని వీడియో తీశావు. ఆ వీడియో ద్వారా వచ్చిన డబ్బుతో అప్పుడే కొత్త కారు కొన్నావు. మంచి మంచి కట్టుబాట్లు ఉన్నాయే' అని సెటైర్లు వేస్తున్నారు. చదవండి: గుంటూరు కారం నుంచి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అవుట్ -
వామ్మో ఆ కారుకి అంత డిమాండా? ఏడాదిన్నర వెయిటింగ్ పీరియడ్!!
రా మెటీరియల్ కాస్ట్ పెరిగిందంటూ వరుసగా ఆటో మొబైల్ కంపెనీలు ధరలు పెంచుతూ పోతున్నాయి. ఐనప్పటికీ కార్లకున్న డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. ఇక లేటెస్ట్ ఫీచర్లతో విడుదలైన కార్లను కొనుగోలు చేసేందుకయితే ప్రజలు పోటీ పడుతున్నారు. దీంతో వెయిటింగ్ పీరియడ్ పెరుగుతూ పోతోంది. కరెన్స్ కావాలి ఈ ఏడాది రిలీజైన కార్లలో అత్యధిక వెయిటింగ్ పీరియడ్ ఉన్న కారుగా కియా కరెన్స్ నిలుస్తోంది. ఈ కారుని 2022 ఫిబ్రవరి 15న ఇండియా మార్కెట్లో లాంచ్ చేశారు. ప్రారంభ ధరగా రూ.8.99 లక్షలుగా నిర్ణయించగా ఆ వెంటనే ధరలను సవరించి రూ.9.59 లక్షలకు పెంచారు. ఐనప్పటికీ ఈ కారుకి డిమాండ్ తగ్గడం లేదు. ఏప్రిల్ వరకు 12 వేల యూనిట్లు దేశీయంగా అమ్ముడైపోగా 50వేల కార్లకు బుకింగ్ జరిగింది. కనీసం 23 వారాలు కియా కరెన్స్‌లో ఐదే వేరియంట్లు ఉన్నాయి. ఇందులో పెట్రోల్/ డీజిల్, మాన్యువల్/ఆటో గేర్ షిఫ్ట్, 6/7 సీటర్ వేరియంట్లు ఉన్నాయి. ఇందులో ధర తక్కుగా ఉన్న బేసిక్ వేరియంట్ అయిన ప్రీమియం 1.5 లీటర్ పెట్రోల్ మాన్యువల్‌ను సొంతం చేసుకోవాలంటే గరిష్టంగా 75 వారాల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉందని కియా ప్రతినిధులు తెలిపారు. ఇక ఇందులో హైఎండ్ వేరియంట్ అయిన లగ్జరీ ప్లస్ అయితే 23 వారాల వెయింటింగ్ పీరియడ్ ఉంది. మహీంద్రా ఇక ఇండియాలో అత్యధిక వెయిటింగ్ పీరియడ్ ఉన్న మోడల్‌గా మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఓఓ మోడల్ ఉంది. లేటెస్ట్ ఫీచర్లతో మహీంద్రా గతేడాది రిలీజ్ చేసిన ఈ మోడల్‌ను సొంతం చేసుకునేందుకు చాలా మంది పోటీ పడుతున్నారు. ముందస్తుగా బుకింగ్స్ చేసుకుంటున్నారు. దీంతో ఈ కారు పొందాలంటే 20 నెలల నుంచి రెండేళ్ల వరకు వెయింటింగ్ పీరియడ్ ఉంది. చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ, టయోటా వేలకోట్ల పెట్టుబడులు! -
మహీంద్రా కార్లపై బంపర్ ఆఫర్స్.. రూ.2.58 లక్షల వరకు డిస్కౌంట్లు
మహీంద్రా అండ్ మహీంద్రా తన బెస్ట్ సెల్లింగ్ ఎస్యువి కార్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నట్లు వెల్లడించింది. కంపెనీ ఇటీవల ఎక్స్ యువి700ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. దీంతో ఇతర మహీంద్రా ఎక్స్యువి 500, సబ్ కాంపాక్ట్ ఎక్స్యువి 300, పాపులర్ స్కార్పియో కార్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ డిస్కౌంట్లకు సంబంధించిన వివరాలు కంపెనీ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు. ఈ ఆఫర్ సెప్టెంబర్ 30 వరకు మాత్రమే వర్తిస్తుందనే విషయం గుర్తుంచుకోవాలి. (చదవండి: వారంలో రెండు రోజులు ఆఫీస్..!) మహీంద్రా ఎక్స్యువి 500 డిస్కౌంట్లు మహీంద్రా ఎక్స్యువి 500 డబ్ల్యు11, డబ్ల్యు11 ఆప్షన్ ఎటీ వేరియెంట్లపై కంపెనీ రూ.1,79,800 వరకు క్యాష్ డిస్కౌంట్ తో పాటుగా ₹6,500 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. అలాగే, ఎక్స్ఛేంజ్ కింద ₹50,000 వరకు అదనపు బోనస్ కూడా అందిస్తుంది. ఇంకా కంపెనీ ₹20,000 విలువైన యాక్సెసరీస్ కూడా ఇవ్వనుంది. ఇక డబ్ల్యు7, డబ్ల్యు9, డబ్ల్యు7 ఎటీ, డబ్ల్యు9 ఎటీ వేరియెంట్లపై మహీంద్రా ₹1,28,000 వరకు క్యాష్ డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే, ₹6,500 వరకు కార్పొరేట్ డిస్కౌంట్, ₹50,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, ₹20,000 విలువైన యాక్సెసరీస్ ఇస్తుంది. డబ్ల్యు5, డబ్ల్యు7, డబ్ల్యు9, డబ్ల్యు11 ఆప్షన్, డబ్ల్యు7 ఎటీ, డబ్ల్యు9 ఎటీ, డబ్ల్యు11 ఆప్షన్ ఎటీ మోడల్స్ అన్నింటిపై, కంపెనీ ₹2,58,000 వరకు ప్రయోజనాలను కూడా ఇవ్వనుంది. మహీంద్రా ఎక్స్యువి 300 డిస్కౌంట్లు డబ్ల్యు8 ఆప్షన్ డ్యూయల్ టోన్ బీఎస్ఐవీ, డబ్ల్యు8 ఆప్షన్ డ్యూయల్ టోన్, డబ్ల్యు8, డబ్ల్యు8 ఆప్షన్ డ్యూయల్ టోన్, డబ్ల్యు8 ఆప్షన్ డీజిల్, డబ్ల్యు8 ఎఎమ్ టి ఐచ్ఛిక డీజిల్, డబ్ల్యు8 ఆప్షన్ డ్యూయల్ టోన్, డబ్ల్యు8 ఆప్షన్ ఎఎమ్ టి, డబ్ల్యు8 డీజిల్ సన్ రూఫ్, డబ్ల్యు8 ఎఎమ్ టి ఆప్షన్ డీజిల్ డ్యూయల్ టోన్, డబ్ల్యు8 ఎఎమ్ టి ఆప్షన్ డీజిల్ డ్యూయల్ టోన్ వంటి కార్లపై కంపెనీ ₹4,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్, ₹20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, ₹15,000 వరకు క్యాష్ డిస్కౌంట్ అందిస్తోంది. ఇక కొనుగోలుదారులు యాక్ససరీలపై ₹5000 ఆఫర్ పొందవచ్చు. ఇక డబ్ల్యు4, డబ్ల్యు4 డీజిల్ కార్లపై కంపెనీ ₹4,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్, ₹20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తోంది. అలాగే యాక్ససరీలపై కంపెనీ ₹5,000 వరకు తగ్గింపును అందిస్తోంది. మహీంద్రా స్కార్పియోపై డిస్కౌంట్లు ఎస్3 ప్లస్ కొరకు, ఎస్3 ప్లస్ 9 సీటర్ కార్లపై మహీంద్రా ₹4,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ అందిస్తోంది. కంపెనీ ₹5,000 వరకు ఉచిత యాక్ససరీలను కూడా అందిస్తోంది. ఎస్11, ఎస్9, ఎస్7 కార్లపై కంపెనీ కేవలం ₹4,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ ఇస్తుంది. ఎస్5 వేరియంట్ కారుపై కంపెనీ ₹4,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్, ₹15,000 వరకు విలువైన ఉచిత యాక్ససరీస్ ఆఫర్ అందిస్తోంది. -
ఆగస్టు 14న వచ్చేస్తున్న మహీంద్రా ఎక్స్‌యూవీ 700
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మహీంద్రా ఎక్స్‌యూవీ 700 విడుదల తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక రోజు ముందు ఆగస్టు 14, 2021న ప్రపంచ వ్యాప్తంగా అరంగేట్రం చేస్తుందని కంపెనీ ప్రకటించింది. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 అధికారిక ధరను 2021 అక్టోబర్ లో ప్రకటించాలని భావిస్తున్నారు. ఎక్స్‌యూవీ 500తో పోలిస్తే దీనిలో అత్యాధునిక ఫీచర్లతో ముందుకు రానుంది. కంపెనీ సరికొత్త లోగోతో వస్తున్న తొలి మోడల్ ఇదే. 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ 70 హ్యుందాయ్ అల్కాజర్, టాటా సఫారీ, ఎంజీ హెక్టర్ ప్లస్ వంటి ఎస్యువిలతో పోటీ పడనుంది. రాబోయే ఎక్స్‌యూవీ 700 ధర రూ.14 లక్షలు - రూ.18 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా) మధ్య ఉంటుందని సమాచారం. ఎక్స్‌యూవీ 500 స్ఫూర్తితో సెవెన్ సీటర్ మహీంద్రా ఎక్స్‌యూవీ 700లోనూ యాంగ్యులర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ యూనిట్, వెర్టికల్ క్రోం హైలైట్స్‌తో స్క్వారిష్ గ్రిల్ వంటి ఫీచర్లతో రానుంది. ఈ ఎక్స్‌యూవీ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వేరియంట్లలో లభిస్తుంది. -
మహీంద్రా ఎక్స్‌యూవీ 700 డిజైన్ అదుర్స్
ప్రముఖ వాహన తయారీ సంస్థలు ఎస్యూవీ సెగ్మెంట్లో పోటాపోటీగా వాటి కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి. తాజాగా దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా & మహీంద్రా తర్వాతి తరం ఎక్స్‌యూవీ 700 మోడల్ అడ్రెనోక్స్ 'ఇంటెలిజెంట్' వ్యవస్థను టీజ్ చేసింది. అయితే, ఈ వీడియోలో కొత్త ఎక్స్‌యూవీ 700 డిజైన్ తో సహా ఇంటీరియర్లు, ఫీచర్లు వంటి కొన్ని కీలక వివరాలను వెల్లడించింది. మహీంద్రా కొత్త ఎక్స్‌యూవీ డ్యాష్ బోర్డ్ చాలా విస్తారంగా ఉంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 యాడ్రినోక్స్ అనే కొత్త 'ఇంటెలిజెంట్' సిస్టమ్ ని తీసుకొచ్చింది. ఇది 'తెలివైనది' అని కంపెనీ పేర్కొంది. ఈ ఎక్స్‌యూవీ 700 డిజైన్ చూడాటానికి టొయోటా ఫార్చునర్ లాగే ఉంది. ఇందులోని అడ్రెనోక్స్ 'ఇంటెలిజెంట్' సిస్టమ్ ద్వారా సన్ రూఫ్ తెరవడం, క్లోజ్ చేయడం వంటి ప్రాథమిక విధులను అలెక్సాతో ఇంటిగ్రేట్ చేయవచ్చు. స్క్రీన్లు (మిడ్, ఇన్ఫోటైన్ మెంట్) రెండూ ఒకే గ్లాస్ ప్యానెల్ లో ఉన్న విషయాన్ని కూడా టీజర్ ధృవీకరిస్తుంది. ఈ ఫీచర్ చాలా ఖరీదైన లగ్జరీ కార్లలో చూడవచ్చు. మధ్యలో ఉన్న సమాచారంతో పాటు రెండు చివరల్లో స్పీడోమీటర్, టాకోమీటర్ తో మిడ్ పూర్తిగా డిజిటల్ గా ఉంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 సోనీకి చెందిన 3డీ సౌండ్ ద్వారా పనిచేయనున్నట్లు తెలుస్తుంది. ఈ వీడియోలో ఫీచర్ల పరంగా కారుకు ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేకులు, డ్రైవ్ సెలక్టర్, విభిన్న డ్రైవ్ మోడ్ లు లభిస్తాయని తెలుస్తుంది. దీనిలో 'జిప్', 'జాప్' 'జూమ్' మోడ్లు ఉన్నాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ 700లో స్మార్ట్ డోర్ హ్యాండిల్స్ కూడా రానున్నాయి. ఇలాంటివి టెస్లా కార్లతో పాటు కొన్ని లగ్జరీ బ్రాండ్లలో ఉంటాయి. -
భర్తకు ఖరీదైన కారు గిఫ్టిచ్చిన లాస్య
యాంకర్ లాస్య. ఈ పేరు తెలియని టీవీ ప్రేక్షకులు లేరనడంలో అతిశయోక్తి లేదు. ప్రముఖ యాంకర్‌గా పాపులారిటీ గడించిన ఆమె తన వ్యక్తిగత జీవితంలోని ఆటుపోట్లు కారణంగా బుల్లితెర మీద నుంచి నెమ్మదిగా పక్కకు జరిగింది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడటం, పెద్దలను ఒప్పించి మరోసారి అదే వ్యక్తితో వేదమంత్రాల సాక్షిగా, కుటుంబ సభ్యుల సమక్షంలో భర్త వేలు పట్టుకుని ఏడడుగులు నడిచింది. ఆమె యాంకర్‌గా తిరిగి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న సమయంలో మరోసారి బిగ్‌బాస్ షో నుంచి పిలుపు వచ్చింది. ఈసారి ఆలోచించింది, షోలో పాల్గొనేందుకు ఓకే చెప్పింది. అలా బిగ్‌బాస్ నాల్గో సీజన్లో అడుగు పెట్టిన లాస్య తన అభిమానులను మెప్పించింది. అనవసర విషయాల్లో తలదూర్చకుండా తన పనేదో తను చేసుకుపోయింది. కానీ అందరికీ వండి పెడుతూ వంటలక్కలా స్థిరపడిపోయింది. తన ప్రేమ, పెళ్లి విషయాలు చెప్తూ ఎన్నోసార్లు కంటతడి పెట్టింది. సోమవారం వారి పెళ్లి రోజు. ఈ సందర్భంగా లాస్య కొత్త కారు కొంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 500 కారు కొనుగోలు చేసి భర్తకు కానుకగా ఇచ్చింది. దీని ధర పదహారు లక్షల పైమాటే! View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) ప్రత్యేకమైన రోజుల్లో ఇలాంటి బహుమతినిస్తే ఎంత సంతృప్తిగా ఉంటుందో?! మేము ఇప్పుడు దీనిలో ఓ రౌండ్ వేసుకొస్తాం అని రాసుకొచ్చింది. ఇక నిన్న పెళ్లిరోజును పురస్కరించుకుని మంజునాథ్‌తో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకుంది. ఏ అనుబంధంలోనూ మంచి రోజులే ఉండవు. తుపానులా చుట్టేసే కష్టం ఎదురొచ్చినా సరే ఒకే గొడుగు కింద ఉండి దాన్ని ఎదుర్కొందాం. ఆ శక్తి మనకు ప్రేమ అందిస్తుంది అని భావోద్వేగ నోట్ రాసుకొచ్చింది. తన ప్రేమ కథను చెప్తూ ఓ స్పెషల్ వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసింది. View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) చదవండి: లాస్య ఛానెల్ హ్యాక్: హ్యాపీ అంటున్న నోయల్ బిగ్‌బాస్: అరియానా ఖాతాలో అరుదైన ఘనత సినిమాలు తెలుగోడి దమ్ము చూపిస్తున్నాయి -
మహీంద్ర ట్వీట్.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు
ముంబై : కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. తనకు నచ్చిన, ప్రేరణ కలిగించిన వీడియోలను, విషయాలను షేర్ చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఆనంద్ మహీంద్ర చేసిన చారులత, పేపర్ బాయ్ ట్వీట్లు అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో టీమిండియా సీనియర్ ఆటగాడు ధోనికి సంబంధించిన మూడేళ్ల క్రితం వీడియోతోపాటు ఆయన చేసిన పోస్ట్‌కు నెటిజన్లు హాట్సాఫ్ చెబుతున్నారు. ఆనంద్ మహీంద్ర ట్వీట్లో రెండో అంతరార్థన్ని గుర్తించిన నెటిజన్లు ఆయన వ్యాపార తెలివికి సెల్యూట్ చేస్తున్నారు ‘ధోని, ఆర్మీ దుస్తుల్లో నువ్వు చాలా అందంగా ఉన్నావ్.. అదేవిధంగా నీ ప్రయాణానికి కేటాయించిన వాహనంలో నువ్వు మరింత హుందాగా కనిపిస్తున్నావు’అంటూ మూడేళ్ల క్రితం వీడియోతో పాటు ఈ సందేశాన్ని తన అధికారిక ట్విటర్లో షేర్ చేశాడు. అయితే అసలు విషయం ఇక్కడే ఉంది. ధోని ప్రయాణించిన వాహనం మహీంద్ర XUV 500. తన సంస్థకు చెందిన వాహనంలో ధోని ప్రయాణించడంతో ఆనంద్ మహీంద్ర ఆ విధంగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఇక వెస్టిండీస్‌తో భారత క్రికెట్ జట్టు ఆడే సిరీస్ నుంచి విరామం తీసుకుని, రెండు నెలలపాటు భారత సైన్యంలో సేవలందించాలని మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నిర్ణయం తీసుకున్నాడు. ఎనిమిదేళ్ల నుంచి అతడు పారాచూట్ సైనిక విభాగంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న విషయం తెలిసిందే. ధోని నిర్ణయంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. మా ధోనికి దేశభక్తి ఎక్కువ.. అంటూ క్రికెట్ భారతం ఉబ్బితబ్బిబ్బై పోతుంది. పలు సందర్భాల్లో దేశం, సైన్యంపై ధోని చూపించిన ప్రేమను నెమరవేసుకుంటోంది. -
మహీంద్రా ఎక్స్‌యూవీ 500 చౌక మోడల్
న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ బాగా పాపులర్ అయిన స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్, ఎక్స్‌యూవీ500 మోడల్లో ఎంట్రీ లెవల్ వేరియంట్, డబ్ల్యూ4ను బుధవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కారు ధరను రూ.10.95 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించామని ఎం అండ్ ఎం ఈడీ, ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్) పవన్ గోయెంకా చెప్పారు. మార్కెట్లోకి తెచ్చిన రెండేళ్లలోనే 74 వేల ఎక్స్‌యూవీ500 కార్లు అమ్ముడయ్యాయని వివరించారు. మంచి అమ్మకాలు సాధించిన మోడళ్లలో ఈ కారు కూడా ఒకటని పేర్కొన్నారు. వినియోగదారుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ కొత్త వేరియంట్‌ను రూపొందించామని వివరించారు. ప్రస్తుత ఎక్స్‌యూవీ500 ధరలు రూ.12 లక్షల నుంచి రూ.14.64 లక్షల రేంజ్లో (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)ఉన్నాయి. ఇక 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉన్న ఈ కారులో 6-స్పీడ్ ట్రాన్సిమిషన్, ఆరు రకాలుగా అడ్జెస్ట్ చేసుకోగల డ్రైవర్ సీటు, టిల్ట్ స్టీరింగ్, 4 స్పీకర్లతో కూడిన మ్యూజిక్ సిస్టమ్, రిమోట్ కంట్రోల్ లాకింగ్, ట్విన్ ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ బ్రేకింగ్ సిస్టమ్(ఏబీఎస్) తదితర ప్రత్యేకతలున్నాయి.