
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మహీంద్రా ఎక్స్‌యూవీ 700 విడుదల తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక రోజు ముందు ఆగస్టు 14, 2021న ప్రపంచ వ్యాప్తంగా అరంగేట్రం చేస్తుందని కంపెనీ ప్రకటించింది. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 అధికారిక ధరను 2021 అక్టోబర్ లో ప్రకటించాలని భావిస్తున్నారు. ఎక్స్‌యూవీ 500తో పోలిస్తే దీనిలో అత్యాధునిక ఫీచర్లతో ముందుకు రానుంది. కంపెనీ సరికొత్త లోగోతో వస్తున్న తొలి మోడల్ ఇదే.
2021 మహీంద్రా ఎక్స్‌యూవీ 70 హ్యుందాయ్ అల్కాజర్, టాటా సఫారీ, ఎంజీ హెక్టర్ ప్లస్ వంటి ఎస్‌యువిలతో పోటీ పడనుంది. రాబోయే ఎక్స్‌యూవీ 700 ధర రూ.14 లక్షలు - రూ.18 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా) మధ్య ఉంటుందని సమాచారం. ఎక్స్‌యూవీ 500 స్ఫూర్తితో సెవెన్ సీటర్ మహీంద్రా ఎక్స్‌యూవీ 700లోనూ యాంగ్యులర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ యూనిట్, వెర్టికల్ క్రోం హైలైట్స్‌తో స్క్వారిష్ గ్రిల్ వంటి ఫీచర్లతో రానుంది. ఈ ఎక్స్‌యూవీ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వేరియంట్లలో లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment